శ్రీలీల(Sreeleela).. ప్రస్తుతం టాలీవుడ్ లో మారుమోగిపోతున్న పేరు ఇది. `కిస్` అనే కన్నడ మూవీ తో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ భామ.. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన రొమాంటిక్ మూవీ `పెళ్లి సందD`తో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ సినిమా ఫలితం గురించి పక్కన పెడితే శ్రీలీలకు మాత్రం విమర్శకులు నుండి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా తర్వాత శ్రీలీలకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. తాజాగా ఈ అమ్మడి నుంచి వచ్చిన రెండు చిత్రం `ధమాకా`(dhamaka). మాస్ మహారాజ్ రవితేజ హీరోగా కత్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మాస ఎంటర్టైనర్ ఇది. డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను రాబడుతుంది. అయితే ధమాకా హిట్ తో శ్రీ లీల తన రెమ్యునరేషన్ ను భారీగా పెంచేసిందంటూ తాజాగా ఓ టాక్ బయటకు వచ్చింది. పెళ్లి సందD, ధమాకా చిత్రాలకు రూ. 40 లక్షల రేంజ్ లో పారితోషికం అందుకున్న శ్రీలీల.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.1.5 కోట్లు డిమాండ్ చేస్తుందట.
Click here to follow Pakkafilmy in google news అందుకు ఒక్క రూపాయి తగ్గినా సినిమాకు సైన్ చేయనని తెగేసి చెబుతుందట. ఏదేమైనా ఒక్క హిట్టు తోనే ఈ రేంజ్ లో రెమ్యునరేషన్(Sreeleela Remuneration) పెంచేసిందంటే.. ఇక ముందు ముందు శ్రీలీల నిర్మాతలకు చుక్కలు చూపించడం ఖాయమని ప్రచారం జరుగుతుంది. కాగా, శ్రీలీల ప్రస్తుత ప్రాజెక్టుల విషయానికి వస్తే.. నటసింహం నందమూరి బాలకృష్ణ(balakrishna), అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రంలో శ్రీలీల నటించబోతోంది. అలాగే రామ్ పోతినేని(ram pothineni) హీరోగా బోయపాటి శ్రీను రూపొందిస్తున్న చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా ఎంపిక అయింది. నవీన్ పోలిశెట్టి సరసన `అనగనగా ఓ రాజు`, నితిన్ కి జోడిగా `జూనియర్` చిత్రాలు చేసేందుకు ఇప్పటికే శ్రీలీల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో కూడా శ్రీలీల ఓ సినిమా చేయబోతుంది. వీటితో పాటు త్రివిక్రమ్ మహేష్ కాంబోలో తెరకెక్కబోయే `ఎస్ఎస్ఎమ్బీ 28`లో శ్రీలీల సెకండ్ హీరోయిన్ గా నటిస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. మొత్తానికి చేతినిండా ప్రాజెక్ట్ లతో ఈ యంగ్ సెన్సేషన్ ఫుల్ బిజీ గా కడుగుతోంది.