AP

జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలే చంద్రబాబు విజయానికి మెట్లు

గత ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి రాకపోవడానికి కారణాలను టీడీపీ(Jagan-CBN) అన్వేషిస్తోంది. ఇప్పటికీ ఆ పార్టీకి అంతుచిక్కడం లేదు. మెరుగైనా పాలన కోసం జగన్మోహన్ రెడ్డికి 2019 ఎన్నికల్లో ఏపీ ప్రజలు(AP Publice) ఓటేశారా? చంద్రబాబు పరిపాలన నచ్చలేదా? అనేది టీడీపీకి బోధపడడంలేదు. ప్రజలు చంద్రబాబును అర్థం చేసుకోలేక పోయారని కొందరు, ప్రస్తుత తరానికి చంద్రబాబు కనెక్ట్ కాలేకపోయారని మరికొందరు చెప్పుకొచ్చారు. తరం గ్యాప్ బాగా దెబ్బతీసిందని కొందరు పలు రకాలు గా ఇప్పటి దాకా అంచనా వేస్తూ వస్తున్నారు. అయినప్పటికీ ఇతిమిద్ధంగా చంద్రబాబు అధికారాన్ని కోల్పోవడానికి కారణం మాత్రం ఆ పార్టీకి తెలియడంలేదు. ఆనాడు చంద్రబాబు సీఎంగా ఉండగా రూ. 2వేలు పింఛన్ ఇచ్చారు. ఇసుక ట్రాక్టర్ రూ. 2వేలకు ఇంటి ముందుకు వచ్చేది. రోడ్లు మెరుగ్గా ఉండేవి. సిమెంట్ రోడ్లు విరివిగా గ్రామాల్లో నిర్మించారు. రైతు ఋణ మాఫీ 1.50 లక్షల వరకూ మూడు విడతలుగా అందించారు. ఆరోగ్యశ్రీ పథకం కింద పలు రకాల జబ్బులను చేర్చడం ద్వారా వైద్యం అందించారు. సున్నా వడ్డీ ఋణాలు , డాక్రా ఋణాలు ఇచ్చారు. పోలవరం డెబ్బై శాతం పూర్తి చేసారు. అమరావతి లాండ్ పూలింగ్ పూర్తిచేసి నిర్మాణాల వేగం పెంచారు. ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్, ఐ.ఎ.యం లాంటి సంస్థలతో పాటు అనేక విశ్వ విద్యాలయాలను తీసుకొచ్చారు. ఓడ రేవుల ప్రతిపాదనలు, నూతన విమానాశ్రయాల అభివృద్ధి , అనేక అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఉద్యోగులకు తెలంగాణకు మించిన ఆఫర్లను ఇచ్చారు.

పని ఒత్తిడి లేకుండా జీతాలను ప్రతినెలా ఇచ్చారు. వాళ్లు ఆడింది ఆటగా వరాలు ఇచ్చారు. ఆ దశలో (Jagan-CBN)చంద్రబాబును ఏపీ ఓటర్లు గద్దె దించారు. అంతేకాదు, ఘోరంగా 23 మంది ఎమ్మెల్యే వరకు పరిమితం అయ్యేలా టీడీపీని చిత్తు(AP Public) చేశారు. దానికి కారణం ఆ పార్టీకి ఇప్పటికీ బోధపడడంలేదు. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో ఆత్మహత్యలు పెరిగాయి. లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని జడ్జిలు బాధపడుతున్న రోజులివి. ప్రజల్ని భయ భ్రాంతులకు గురి చేస్తూ , మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. చవక మద్యం బ్రాండులు పెట్టి ప్రజల ఆరోగ్యాలతో చెలగాడమాడుతున్నారు. కేంద్రం రాష్ట్రానికి ఇవ్వవల్సిన నిధులు ఇవ్వకుండా అప్పులు చేసుకునేందుకు అవకాశం ఇవ్వడంతో అవధులుదాటి ఏపీని దివాళా మార్గాన నడిపిస్తున్నారు. ఇప్పటికే ఓటర్ లిస్ట్ లో అనేక పేర్లు మాయం చేసారని వినిపిస్తోంది. గత పరిపాలన కంటే బాగుందని వైసీపీ నమ్ముతోంది.విపక్షాలు మాత్రం రాష్ట్రాన్ని లంకలా మార్చేశారని గగ్గోలు పెడుతున్నారు. కానీ, ఓటరు నాడి తెలిసిన జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రతి నెలా బటన్ నొక్కుతూ సంక్షేమ పథకాలను ఓట్లగా మార్చుకునే దిశగా వెళుతున్నారు. ఓటరు యొక్క ప్రాధాన్యతలు కూడా మారాయి. ఇప్పుడు సగటు ఓటరు మా గ్రామానికి రోడ్డు అనో , మంచినీటి ట్యాంక్ కావాలనో అడగడం లేదు. వ్యక్తిగతంగా నాకు చేకూరే లబ్ది ఏమిటో చెప్పండని ప్రశ్నిస్తున్నారు. నా ఎకౌంట్ లో ఎన్ని డబ్బులు వేస్తారో చెప్పండి అని అడుగు తున్నాడు. అందుకే ప్రభు త్వాలు వ్యక్తిగత లబ్ధి చేకూర్చే , ఉచిత పధకాలకు ప్రాముఖ్యత నిస్తున్నాయి. ఇప్పటికే గ్రామాల్లో వాలంటీర్ల ద్వారా చాపకింద నీరులా బూత్ ల వారీగా ఒడపోత మొదలైనదని తెలుస్తోంది. చర్చ్ , మసీదు మతపెద్దలు ప్రభుత్వ అనుకూలంగా లోపాయికారిగా పనిచేస్తు న్నారట . ఇక కులచిచ్చు రాయుళ్ళు ఎలాగూ సిద్ధంగానే ఉంటారు . కులాలు , మతాలను విడగొట్టే బాధ్యత సలహాదారులు తీసుకుంటారు. వారి రిపోర్టు ల ఆధారంగా సొంత మీడియా రెండు చేతులతో రాసి పడేస్తుంది.