AP

పార్వతిపురం మన్యం జిల్లా మక్కువ మండలం శంబర గ్రామంలో కొలువైయున్న గిరిజన ఆరాధ్య దైవం అయిన శ్రీశ్రీశ్రీ సంబరపాలమాంబ సిరిమానోత్సవం

పార్వతిపురం మన్యం జిల్లా మక్కువ మండలం శంబర గ్రామంలో కొలువైయున్న గిరిజన ఆరాధ్య దైవం అయిన శ్రీశ్రీశ్రీ సంబరపాలమాంబ సిరిమానోత్సవం అంగుగరంగ వైభవంగా ఎటువంటి ఆటంకం లేకుండా జరిగింది. ఈ జాతరకు సుమారు రెండు లక్షల వరకు భక్తులు అమ్మవారి దర్శనార్థం వచ్చారని అంచనా. చుట్టుపక్కల గ్రామాల నుంచి కాకుండా ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా ఛత్తీస్గడ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా చాలామంది భక్తులు అమ్మవారి దర్శనార్థం విచ్చేశారు. ఉపముఖ్యమంత్రి.. గిరిజన సంక్షేమ మంత్రి వర్యులు అయినటువంటి శ్రీ పిడిక రాజన్నదోర గారు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. సంబర పోలమాంబ చాలా స్వచ్ఛమైన తల్లి అని ఆయన పేర్కొన్నారు ఎటువంటి వారు ఎలాంటి కోరికలు కోరుకున్న తీరుతాయని ఆయన చెప్పారు ఎటువంటి వారు ఎలాంటి కోరికలు కోరుకున్న తీరుతాయని ఆయన చెప్పారు. పోలమాంబ అమ్మవారు చాలా స్వచ్ఛమైన తల్లి అని ఆయన చెప్పారు. ఈ పార్వతిపురం జిల్లాలో పెద్ద పండుగ సంబరపాలమాంబ పండుగని ఆయన చెప్పారు అమ్మవారి దర్శనార్థం వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుమారు 700 మంది పోలీసులు విధులు నిర్వహించారు అలాగే సుమారు 105 బస్సుల వరకు ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా జాతర కోసం వేయడం జరిగింది. దర్శనార్థం వచ్చిన భక్తులకు మంచినీటి సదుపాయం
చిన్నపిల్లలకు పాలు అందించినట్లు ఎండోమెంట్ ఆఫీసర్ తెలిపారు. సినిమానోత్సవాన్ని ఈ సంవత్సరం అధిష్టించింది పేకాపు రామారావు