AP

జగన్ ఎత్తుగడకు టెక్నాలజీతో చెక్ పెట్టేలా చంద్రబాబు చతురత

విజయం సాధించడానికి అభ్యర్థుల ఎంపిక, ప్రచారం, ఎలక్షనీరింగ్ ఈ మూడు అంశాలు ప్రధానం. వాటిలో ఏ ఒక్క దానిలో వెనుకబడ్డా గెలుపు అందుకోవడం కష్టం. ఆ విషయాన్ని బాగా తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని అందుకున్నారు. ఈసారి వాటికి మరింత పదును పెడుతూ వాలంటీర్లు, వాళ్లకు సమాంతరంగా పొలిటికల్ వాటంటీర్లను సిద్ధం చేశారు. వాళ్ల ద్వారా ఇప్పటికే ఓటర్ల జాబితాలోని టీడీపీ సానుకూల ఓటర్ల పేర్లను తొలగించారు. ఆ విషయాన్ని గమనించిన టీడీపీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. అంతేకాదు, ఓటర్ల జాబితాలకు సాంకేతిక(CBN Giotag)ను జోడిస్తూ సానుభూతి ఓటర్లను(Voters) కాపాడుకునే వ్యూహాన్ని చంద్రబాబు రచించారు. ఆ క్రమంలో జియో ట్యాంగింగ్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఓటర్ల జాబితాలకు సాంకేతిక(CBN Giotag) కేంద్ర ఎన్నికల సంఘం ఏపీలోని ఓటర్ల(Voters) జాబితా సిద్ధం చేసింది. దానిపై తొలుత టీడీపీ అధిష్టానం దృష్టి పెట్టింది. మొత్తం 175 నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ ఇన్ఛార్జిలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఆ జాబితాలను అందించింది. వాటిని పరిశీలన చేసే బాధ్యతను అప్పగించింది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన ప్రారంభించి వీలున్నంత వేగంగా ముగించాలని ఆదేశించింది.

ఫలితంగా ప్రతి నియోజకవర్గంలోనూ సర్వే చేస్తున్నారు. మండలాలవారీగా జాబితాలను పరిశీలించడానికి రంగంలోకి దిగారు. కుప్పంలో ప్రత్యేకంగా ఒక యాప్ రూపొందించడంతో పాటు ఓటర్ల జాబితాను జియో ట్యాగింగ్ (CBN Giotag)చేస్తున్నారు. ఈ నియోజకవర్గాన్ని నమూనాగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్లా ఆ విధంగా చేయాలని టీడీపీ జాగ్రత్తపడుతోంది. Also Read : CBN : YCP సిట్టింగ్ లకు టిక్కెట్లు రావాలని TDP ఇంచార్జిల గాంధీయమార్గం.! సానుకూల ఓటర్లను జాబితా ఆధారంగా జియో ట్యాగ్ చేస్తారు. తద్వారా జాబితాలో ఎక్కడైనా పేర్లు నమోదు కాకపోయినా, తొలగించినా వెంటనే ఓటరును అప్రమత్తం చేసేలా టీడీసీ సాంకేతికతను ఉపయోగిసక్తోంది. ఓటును తొలగిస్తే వెంటనే ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకునేలా అవగాహన కలిగించే బాధ్యతను కార్యకర్తలకు అప్పగించింది. ఇప్పటికే వైసీపీ అనుకూల ఓటుబ్యాంకు పెరిగేలా వ్యూహాత్మకంగా ఓటర్ల జాబితాను తయారు చేసినట్టు ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గుర్తించారు. సుమారు 7వేల ఓట్లను ఉరవకొండలో తొలగించినట్టు కనుగొన్నారు. మైలవరం మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమ కూడా తన నియోజకవర్గ పరిధిలో ప్రత్యేకంగా ఒక యాప్ ను రూపొందించుకున్నారు. దీనిద్వారా ఎన్ని ఓట్లున్నాయి? ఎన్ని ఓట్లు గల్లంతయ్యాయి? అనే విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.