కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో వేంచేసియున్న అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారికి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి విశేష పంచామృతాభిషేకములు, అన్నపూర్ణాదేవికి కుంకుమార్చన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించికున్నారు.
రాత్రి 9 గంటలకి శ్రీ స్వామివారికి లింగోద్భవ సమయమున మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం 21 రకముల ద్రవ్యములతో సద్యోజాత విధానముగా షోడశోపచార పూజాధి కార్యక్రమాలు కన్నుల పండుగగా జరిగాయి.
ఈ కార్యక్రమాలలో కిర్లంపూడి, చిల్లంగి,జగపతినగరం గ్రామ ప్రజలే కాక అనేక ప్రాంతాల నుంచి ఆలయానికి తరలివచ్చి స్వామివారి లింగోద్భవ కాలాభిషేకములో పాల్గొని స్వామి వారి తీర్థప్రసాదాలు సేవించి జాగరణ మహోత్సవాన్ని పూర్తి చేశారు.
ఆలయ అభివృద్ధి కమిటీ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేశారు