AP

గర్భిణీ మహిళలకు పౌష్టికాహారం అందించడం జన్మ జన్మల సుకృతం అన్న మామిడి నరసింహమూర్తి

 

ప్రత్తిపాడు,గర్భిణీ మహిళలకు,తల్లులకు ఒక పూట ఆకలి తీర్చి వారికి పౌష్టికాహారం అందజేయడం పూర్వజన్మతో పాటు గర్భిణీ తల్లులకు ఆహారాన్ని అందించడం జన్మ జన్మల సుకృతమని ప్రత్తిపాడు మండలం ఒమ్మింగి గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మామిడి నరసింహమూర్తి పేర్కొన్నారు. ప్రతిపాడు మండలం రాచపల్లి గ్రామంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో ప్రత్తిపాడు శాసనసభ్యులు పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ ఆదేశాల మేరకు సుమారు 160 మంది గర్భిణీ మహిళలు వైద్య పరీక్షలు నిమిత్తం హాస్పటల్ ప్రాంగణానికి విచ్చేయడంతో వారికి పౌష్టిక విలువలతో కూడిన ఆహారాన్ని కాకినాడ చెందినా ప్రముఖుడు యాళ్ల సందీప్
ఏర్పాటు చేశారు.ఈ ఆహారాన్ని యాళ్ల సందీప్ దంపతులు సొంత నిధులతో ఏర్పాటు చేసి గర్భిణీలకు అందించారు ప్రత్తిపాడు మండలంలోని పెద్దిపాలెం, శాంతి ఆశ్రమం, రాచపల్లి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నెలకు రెండు మూడు సార్లు వైద్య పరీక్షలకు హాజరయ్యే గర్భిణీ మహిళలకు సహాయం అందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మామిడి నరసింహమూర్తి, యాళ్ల సందీప్ జన్మనిచ్చే తల్లులకు ఆహారాన్ని అందించడం ఎన్నో జన్మల పుణ్యమని ప్రతి సామాజిక సేవకులు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలకు వచ్చేవారికి ఆహారం అందించడం సహాయం అందించడం ఎంతో దైవత్వం అయిన కార్యక్రమం అని ప్రతి ఒక్కరూ ముందుండాలని ఈ మేరకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల ఆరోగ్య వైద్యాధికారి డాక్టర్ పవన్ కుమార్,డాక్టర్ గీతా సుధా, వైద్య సిబ్బంది మాణిక్యం, రత్నకుమారి, సత్యవతి, జువ్వల శ్రీను,చందర్రావు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.