AP

వివేకా హత్య వెనక కారణమేంటో చెప్పేసిన వైయస్ షర్మిల..!

మాజీ మంత్రి, ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల స్పందించారు.

తన చిన్నాన్న హత్య ఆస్తి కోసం జరగలేదని ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.

వివేకానంద రెడ్డిపై ఉన్న ఆస్తులన్నీ, ఆయన ఎప్పుడో సునీత పేరు మీద వీలునామా రాశారని వైయస్ షర్మిల పేర్కొన్నారు. ఆస్తుల కోసం వివేకానంద రెడ్డిని హత్య చేశారని చెప్పడం కరెక్ట్ కాదన్నారు. సునీత పేరు మీద ఆస్తులన్నీ ఉంటే, వేరే వారికి రాస్తారు అనడంలో అర్థం లేదని వైయస్ షర్మిల పేర్కొన్నారు.

ఆస్తుల కోసమే వివేకానంద రెడ్డిని అల్లుడు రాజశేఖర్ రెడ్డి హత్య చేశారు అనుకుంటే, అలాంటప్పుడు చంపాల్సింది వైయస్ వివేకానంద రెడ్డిని కాదు సునీతను అంటూ ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకానంద రెడ్డి ప్రజల మనిషి అని పేర్కొన్న షర్మిల తన చిన్నాన్న ఎలాంటివారో, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో పులివెందుల, కడప జిల్లా ప్రజలకు తెలుసన్నారు. వివేకానందరెడ్డి చాలా సాధారణ జీవితం గడపారన్నారు.

కొన్ని మీడియా సంస్థలు ఆయన వ్యక్తిగత జీవితం గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నారు అని వైయస్ షర్మిల మండిపడ్డారు. తన చిన్నాన్న వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే హక్కు, అర్హత ఎవరికీ లేదని ఆమె పేర్కొన్నారు. ఆయనపై చేసిన తప్పుడు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని వైయస్ షర్మిల వెల్లడించారు. వివేకానంద రెడ్డి హత్య ఆస్తి కోసం జరిగింది కాదని వైయస్ షర్మిల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే వివేకా హత్య కేసులో సిబిఐకి సునీత మొదట ఇచ్చిన వాంగ్మూలంపై అనుమానాలు ఉన్నాయని కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. సీబీఐ ఒక్క కోణంలోనే దర్యాప్తు చేస్తుందని, హత్య కేసును ఛేదించడం కంటే తనను ఇరికించడం కోసమే సిబిఐ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.

రెండేళ్లుగా తాను ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదని అందుకే ఇలా జరిగిందంటూ వ్యాఖ్యలు చేశారు. వివేకానంద రెడ్డి రాసిన లేఖ, సెల్ ఫోన్ సాయంత్రం వరకు దాచిపెట్టారని ఆ కోణంలో వారిని ఎందుకు ప్రశ్నించలేదో .. ఎందుకు దర్యాప్తు చేయలేదో