AP

ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని ఎమ్మార్పీఎస్ జాతీయ రహదారిపై దిగ్బంధం…

 

కంచికచర్ల,ఫిబ్రవరి13ఆంధ్ర పత్రిక):పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని కోరుతూ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేర కు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జాతీయ రహదారుల దిగ్బంధం చేశారు.కంచికచర్ల జాతీయ రహదారి దిగ్బంధం చేసిన ఎమ్మార్పీఎస్ నాయకులను కార్యకర్తలను అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించిన కంచికచర్ల పోలీసులు.ఈ సందర్భంగా ఎమ్మెస్ పి నాయకులు డాక్టర్ విశ్వనాథం మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమం చేపట్టామని,ఎస్సీ వర్గీకరణ బిల్లును తక్షణమే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని , ప్రవేశపెట్టని పక్షంలో ప్రధాని మోడీకి రాబోయే ఎన్నికలలో బిజెపి పార్టీకి వ్యతిరేకంగా నిలబడుతుందని,ఈ వర్గీకరణ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు తెలపాలని కోరుతూ రహదారి దిగ్బంధం కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీసులకి కార్యకర్తలకి మధ్య తోపులాట జరిగింది పలువురు ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు నాయకులకు స్వల్ప గాయాలు అయ్యాయి.