AP

ఏపీలో ప్రాథమిక విద్య, ఇంటర్ చదివిన విద్యార్థికి తెలంగాణలో నివాసం ధ్రువీకరణ పత్రం ఇవ్వడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం

ఏపీలో ప్రాథమిక విద్య, ఇంటర్ చదివిన విద్యార్థికి తెలంగాణలో నివాసం ధ్రువీకరణ పత్రం ఇవ్వడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని అలంపూర్ తసీల్దార్ ను ఆదేశించింది.

జోగులాంగ గద్వాల జిల్లా అలంపూర్ కు చెందిన సింగోటం వెన్నెల ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు కర్నూలులో చదివింది. ఇంటర్ కృష్ణా జిల్లాలో చదివింది. వెన్నలక మెడికల్ అడ్మిషన్ నిమిత్తం స్థానిక ఎమ్మార్వో 18 ఏళ్లుగా వెన్నల స్థానికంగా ఉంటుందని నివాస ధ్రువీకరణ పత్రం ఇచ్చారు.

ఈ సర్టిఫికేట్ తోనే వెన్నెల కౌన్సెలింగ్ కు వెళ్లింది. అయితే నివాస ధ్రువీకరణ పత్రాన్ని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నిరాకరించింది. దీనిపై వెన్నెల హైకోర్టును ఆశ్రయించారు. వెన్నెల పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ ఎన్‌.వి.శ్రవణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేసింది. తన క్లైయింట్ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం నివాస ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించిన హెల్త్ యూనివర్సిటీ పరిగణలోకి తీసుకోలేదని వాదించారు.

వెన్నెల స్టడీ సర్టిఫికేట్లు పరిశీలించిన ధర్మాసనం ఏపీలో చదిన విద్యార్థికి తెలంగాణలో నివాస ధ్రువీకరణ పత్రం ఏ విధంగా ఇచ్చారో చెప్పాలని అలంపూర్ తసీల్దార్ ను ప్రశించింది. గత జులైలో మెడికల్, డెంటల్ సీట్ల భర్తీకి చెందిన నిబంధనలను సవరిస్తూ తెలంగాణ సర్కార్ జీవో జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఆరుగురు విద్యార్థులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 95 ప్రకారం 2014 జూన్ 2 నుంచి 2024 జూన్ 1 వరకు విద్యాసంస్థల్లో సీట్లను ప్రస్తుతం ఉన్నట్లుగానే రెండు రాష్ట్రాల విద్యార్థులకు కేటాయించాలని కోరారు. జీవో 72 చెల్లదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు 2014 జూన్ 2 వరకు ఉన్న మెడికల్ కాలేజీల్లో గతంలో మాదిరిగానే సీట్లు కేటాయించాలని. 2014 జూన్ 2 తర్వాత ఏర్పడిన మెడికల్ కాలేజీల్లో కాంపిటేటివ్ అథారిటీ కోటాలోని వంద శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకు కేటాయించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. స్థానికతకు సంబంధించి శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రాలను తీసుకుని కాళోజీ వైద్య విశ్వవిద్యాలయానికి సమర్పించాలని పేర్కొంది.