AP

గిరిజన విద్యార్థినుల భవిష్యత్తును కాపాడాలి.ఆదివాసి జేఏసీ డిమాండ్.

గిరిజన విద్యార్థినుల భవిష్యత్తును కాపాడాలి.ఆదివాసి జేఏసీ డిమాండ్.

ప్రభుత్వం తక్షణమే స్పందించి ముసిని కుంట బాలికల ఆశ్రమ పాఠశాల హాస్టల్ లో మౌలిక సౌకర్యాలు కల్పించి గిరిజన విద్యార్థినుల భవిష్యత్తును కాపాడాలని ఆదివాసి జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమం అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం, దేవీపట్నం మండలం,పోతవరం గ్రామంలో జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముసిని కుంట ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల హాస్టల్ నుండి ఉపాధ్యాయులు పోతవరం గ్రామంలో విద్యార్థినుల ఇంటింటికి వెళ్లి విద్యార్థినులకు వారి తల్లిదండ్రులకు చదువు యొక్క అవశ్యాతను తెలియజేస్తూ అవగాహన కల్పించడం శుభ పరిణామం అన్నారు.అలాగే తల్లిదండ్రులకు మీ విద్యార్థినులను పాఠశాలకు పంపించాలని విజ్ఞప్తి చేశారన్నారు.

ఈ సందర్భంగా తెల్లం శేఖర్
మాట్లాడుతూ ఇటీవల కాలంలో ముసిని కుంట ఆశ్రమ పాఠశాల హాస్టల్ విద్యార్థినులు ఇద్దరు మరణించడంతో మిగతా విద్యార్థినులు భయపడుతున్నారన్నారు.కావున రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఉపయోగించి రెగ్యులర్ ఏఎన్ఎం లను నియమించాలి.బాలికల హాస్టల్ లో గైనకాలజిస్ట్ డాక్టర్ ని నియమించాలి.హాస్టల్లో నాన్ టీచింగ్ స్టాఫ్ ను కూడా రెగ్యులర్ ప్రతిపాదించిన నియమించాలి. మొదలైన మౌలిక వసతులను హాస్టల్స్ లో తక్షణమే ఏర్పాటు చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో కె. ప్రకాష్,కె.సుబ్బలక్ష్మి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.