AP

కాలినడకన వచ్చే నాటు సారా రవాణాపై అర్థరాత్రి మెరుపు దాడులు

పార్వతీపురం మన్యం జిల్లా
పట్టణంలో
కాలినడకన వచ్చే నాటు సారా రవాణాపై అర్థరాత్రి మెరుపు దాడులు

800 లీటర్ల నాటు సారా స్వాధీనం, ముగ్గురు అరెస్టు మరియు మరో ముగ్గురిపై కేసు నమోదు

పార్వతీపురం మన్యం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ. వి. విద్యా సాగర్ గారు స్పెషల్ ఎన్ఫోర్స్మెమెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ శ్రీ. దిలీప్ కిరణ్ వారి ఆదేశాల మేరకు సెబ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో అర్థరాత్రి దాటిన తరువాత కాలినడకన ఒడిషా రాష్ట్రం నుండి పార్వతీపురం మున్సిపాలిటీ కొత్తవలసకు నాటుసారా రవాణా చేస్తున్నారన్న సమచారం మేరకు పార్వతీపురం మున్సిపాలిటీ సూర్య పీఠం సమీపంలో గల పొలాల్లో కాపుకాసి 800 లీటర్ల నాటుసారను సీజ్ చేసి జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామానికి చెందిన ప్రస్తుతం కొత్తవలస లో నివసిస్తున్న వెలగాడ. సాగర్ ను అదుపులోకి తీసుకొని విచారించగా ఒడిషా రాష్ట్రంనకు చెందిన మెల్లక. ముత్యాలు అను వ్యక్తి వద్ద కొని పార్వతీపురం మరియు వీరఘట్టం ప్రాంతాలకు చెందిన ఐదుగురు వ్యక్తులకు సరఫరా చేయడానికి ఒడిశా కూలీల ద్వారా కాలినడకన తలిస్తున్నట్లు తెలిపారు. విచారణలో భాగంగా సదురు వ్యక్తితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేయడమైనది . ఈ కేసుతో సంబంధం ఉన్న మిగతా ముగ్గురు వ్యక్తులను త్వరలో అరెస్ట్ చేసి రిమండ్కు తరలించడం జరుగుతుంది. ఈ దాడుల్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ ఎల్. ఉపేంద్ర తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.