AP

పొత్తు చిత్తేనా? టీడీపీకి దూరంగా జనసేన జరుగుతోందా?

ఎవరో ఒకరు.. ఎప్పుడో అప్పుడు ఏదో పుల్లలు పెడుతూనే ఉంటారు. ఈసారి చంద్రబాబు భయమే పవన్ కళ్యాణ్ ను దూరం చేసుకునే పరిస్థితి వచ్చింది.

చంద్రబాబు మౌత్ పీస్ గా భావించే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ‘కొత్తపలుకు’ పేరిట అంటించిన మంటలు ఇంకా చల్లారడం లేదు. జనసైనికులు దీనిపై మండిపడుతున్నారు. పవన్, నాగబాబు, నాదెండ్ల సైతం టీడీపీ కుట్రలను పసిగట్టారని చర్చ సాగుతోంది.

నిజానికి పవన్ ఒక మంచి ఉద్దేశంతో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ టీడీపీతో పొత్తుకు మొగ్గు చూపుతున్నాడు. బీజేపీ ఆఫర్ ఇచ్చినా కూడా మొగ్గకుండా జగన్ ను ఓడించేందుకు టీడీపీతో కలిసి సాగాలని డిసైడ్ అయ్యాడు. అలాంటి సువర్ణావకాశాన్ని ఏబీఎన్ ఆర్కే పుల్లలు పెట్టి మరీ చెడగొడుతున్నాడని జనసైనికులు భావిస్తున్నారు.

తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏపీలో పవన్ కు 1000 కోట్లు ఆఫర్ చేసి టీడీపీతో కలవకుండా చేస్తున్నాడని.. సొంతంగా బీఆర్ఎస్ తో కలిసి సాగేలా చక్రం తిప్పుతున్నాడని ఏబీఎన్ ఆర్కే రాసిన రాతలు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా.. ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. . ఇలాంటి తప్పుడు రాతలతో పవన్ ను టీడీపీతోనే పొత్తు పెట్టుకునేలా లొంగదీసుకునే స్కెచ్ ను చంద్రబాబు తన ఆప్త మిత్రుడు ఏబీఎన్ ఆర్కేతో చేసినట్టు అర్థమవుతోందంటున్నారు. ఏబీఎన్ ఆర్కే -చంద్రబాబు స్కెచ్ గీసినట్టుగా పవన్ ను బీఆర్ఎస్ సహా బీజేపీతో వెళ్లకుండా ఇలా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని జనసైనికులు విమర్శిస్తు్నారు. వీటిని గట్టిగా తిప్పికొట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇలాంటి తప్పుడు ప్రచారంతో టీడీపీకే దెబ్బ. టీడీపీతో వెళదామనుకుంటున్న పవన్ కళ్యాణ్ తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది. ఈ కథనాలతో టీడీపీతో పొత్తుపై జనసేన పునరాలోచిస్తోందని అంటున్నారు. అవసరమైతే బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకొని సాగితే బెటర్ అని జనసేన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఏబీఎన్ ఆర్కేతో చంద్రబాబు ఆడిస్తున్న మైండ్ గేమ్ తో పవన్ ను పలుచన చేస్తే అది టీడీపీతో పొత్తు పొడవకుండా దారితీస్తుందని జనసైనికులు హెచ్చరిస్తున్నారు.