లెప్రసీ కాలనీకి త్రాగునీటిని సక్రమంగా అందించాలని పార్వతీపురం మన్యం జిల్లా సిపిఐ ఎం.ఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి. సంఘం డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఆ కాలనీలో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన కాలనీ వాసులతో కలిసి మీడియా ముఖంగా మాట్లాడారు. పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి లెప్రసీ కాలనీలో సుమారు 18 ఇల్లు ఉన్నాయని, గత సంవత్సర కాలంగా వీరికి త్రాగునీరు సక్రమంగా అందడం లేదని, ఫలితంగా నీటి అవసరాలను తీర్చుకునే క్రమంలో వారికి తిప్పలు తప్పడం లేదని మండిపడ్డారు. ముఖ్యంగా వీరిలో కొంతమంది నడవలేని పరిస్థితిలో ఉన్నారని, కావున అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి త్రాగునీరు సమస్యను పరిష్కరించాలని కోరారు.