AP

నేటి నుండి ఏప్రిల్ 4  వరకు చేప్పట్టబోవు ఉద్యమాన్ని క్షేత్ర స్థాయిలో ఉద్యోగులు విజయవంతం చేయాలి.–:ఏపీ జెఎసి అమరావతి చైర్మన్ కె.రమేష్ కుమార్ పిలుపు…

ఏలూరు,

ఏపీ జెఎసి అమరావతి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈనెల 9 నుండి ఏప్రిల్ 4  వరకు చేప్పట్టబోవు ఉద్యమ కార్యాచరణ క్షేత్ర స్థాయిలో విజయవంతం చేయుటకు గాను  బుధవారం ఏలూరు లోని స్థానిక రెవిన్యూ భవనంలో ఏపీ జెఎసి అమరావతి చైర్మన్ కె.రమేష్ కుమార్ వారి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి సభ్య సంఘాల జిల్లాఅధ్యక్షా కార్యదర్శులు అలాగే  జిల్లా కార్యవర్గము పాల్గొని విస్తృతంగా చర్చించిన మేరకు ఉద్యమ కార్యాచరణ ముందుకు తీసుకొని వెళ్ళి అమలు పరచి విజయవంత అయ్యే విధముగా అడుగులు పడాలని కోరారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్  కె.రమేష్ కుమార్  మాట్లాడుతూ ఈ ఉద్యమ కార్యాచరణలో ప్రతి ఒక్క ఉద్యోగి స్వచ్ఛందముగా రేపటి నుండి జరగబోవు నిరసన కార్యక్రమములో పాల్గొనాలని పిలుపున్నిచారు. అదేవిధముగా 9 నుంచి 10 వ తేదీలలో ప్రతి ఒక్క ఉద్యోగి నల్ల బ్యాడ్జిలతో విధులకు హాజరై మన నిరసనను రాష్ట్ర ప్రభుత్వమునకు తెలియజేయాలని తెలిపియున్నారు. ఏపీ జెఎసి అమరావతి కార్యాచరణ ఇస్తే,ప్రభుత్వం నిన్న జరిగిన మంత్రుల కమిటీలో 3 వేల కోట్ల రూపాయలను ఈ నెల ఆఖరి లోపు ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అదే ఉద్యమం చెపడితే ప్రస్తుతం ఉద్యోగలు అందరూ ఎదుర్కొనుచున్న అన్నీ సమస్యలు పరిష్కారం దిశగా ముందుకు వెళ్తాయని, ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొనివెళ్లగలమని కావున ప్రతి ఒక్క ఉద్యోగి స్వచ్ఛంధముగా ఈ నిరసన కార్యక్రమములో పాల్గొనాలని తద్వారా ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న దీర్గకాలిక సమస్యలు పరిష్కారమై ఉద్యోగులకు మేలు జరగనున్నట్లు తెలిపారు.ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న అన్ని సభ్య సంఘాల జిల్లాఅధ్యక్షా కార్యదర్శులు ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏపీ జెఎసి అమరావతి జనరల్ సెక్రటరీ బి. రాంబాబు , రెవెన్యూ సర్వీసెస్ అస్సోసియేషన్ జిల్లా సెక్రటరీ ఏ. ప్రమోధ్ కుమార్ సిపిఎస్ జిల్లా అధ్యక్షులు వీరవల్లి వేంకటేశ్వర రావు,

సిపిఎస్ జిల్లా కార్యదర్శి రామారావు,పెన్షనర్స్ జిల్లా కార్యదర్శి మహాలక్ష్ముడు, ఏపీ జెఎసి అమరావతి రాష్ట్ర కార్యదర్శి జి. జ్యోతి,గ్రామ,వార్డ్ సచివాలయ ఉద్యోగుల రాష్ట్ర ఉపాధ్యక్షులు హుస్సైన్, గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగుల అధ్యక్ష కార్యదర్శులు,

కమల్ ,సాయినాధ్ ,ఏలూరు రెవెన్యూ డివిజన్ అధ్యక్షకార్యదర్శులు కృష్ణ స్వామి, శ్రీనివాసు,హెడ్ మాస్టర్ అస్సోసియేషన్ జిల్లా అధ్యక్షులు రమణ ,జిల్లాలో ఉన్న వివిధ సంఘముల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.