ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడికి పంపించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లుగా అందులో పేర్కొన్నారు. ఇదిలావుంటే, రాజకీయ అజ్ఞాతం వీడి.. కొత్త పోలిటికల్ రీఎంట్రీకి సిద్ఢమయ్యారు. సెడన్ గా తన ఆలోచన మార్చుకున్నారు. కాంగ్రెస్‌కు మరోసారి బైబై చెప్పి.. కాషాయం కండువా కప్పుకోబోతున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్‌గా, ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రిగా.. సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షులుగా .. అనుభవం ఉన్న నల్లారి కుమార్ రెడ్డి.. 2014 ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆపార్టీకి పూర్వ వైభవం తెస్తారని ఆశీంచినా.. ఎందుకో అంటీముట్టనట్లుగా ఉన్నారు. ఇప్పుడు బీజేపీలో చేరి తన పొలిటికల్ స్పీడ్ పెంచబోతున్నారు.
ఇప్పటికే బీజేపీ అధిష్టానంతో సుదీర్ఘ చర్చలు జరిపారు కిరణ్ కుమార్ రెడ్డి. జాతీయ స్థాయిలో కీలక పదవికి అప్పగించేందుకు బీజేపీ హామీ ఇచ్చిన నేపథ్యంలో.. అగ్రనేతల సమక్షంలో కాషాయ కండువా కప్పుకోబోతున్నారు కిరణ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్‌కు రాజీనామా చెయ్యాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల అది మరో రెండు రోజులకు వాయిదా పడింది.
కాంగ్రెస్‌కు రాజీనామా చేసి.. బీజీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు కిరణ్ కుమార్ రెడ్డి. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్ గా, స్పీకర్ గా, మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీలో చేర్చుకొని.. ఏపీలో బీజేపీ పొలిటికల్ గేర్ మార్చేలా కనిపిస్తుంది.