AP

రైతులకు జగన్ సర్కార్ మరో శుభవార్త…

అన్నదాతలు అహర్నిశలు శ్రమించి సాగుచేసిన పంటలను అమ్ముకునే క్రమంలో దళారుల చేతిలో నిలువునా మోసపోతున్నారు. మద్దతు ధర దొరక్కపోవడంతో కనీసం పెట్టుబడులు కూడా రావడంలేదంటూ రైతన్నలు కన్నీరు పెడుతున్నారు. ఇలాంటి దళారుల మోసాలకు స్వస్తి పలుకుతూ ఆంధ్రప్రదేశ్‌ రైతులకు జగన్ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. ప్రస్తుతం రబీ సీజన్ లో పండించే పప్పు, ధాన్యాల కొనుగోలుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో ఏపీలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా.. 99,278 టన్నుల మినుములు, 1,22,933 టన్నుల శనగలు, 45,864 టన్నుల వేరుశనగ, 19,403 టన్నుల పెసలను రైతుల నుంచి కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే అధికారులు శనగల కొనుగోలును ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇక ఏప్రిల్ 1 నుంచి రైతులు పండించిన మిగతా పప్పు ధాన్యాల కొనుగోలు చేయనుంది. ఇందుకోసం మార్క్ ఫేడ్ ఏర్పాటు చేయడం విశేషం.

 

ధరలిలా..

ఇక ధరల విషయానికొస్తే.. శనగలు (క్వింటా)-రూ.5,335 వేరుశనగ-రూ.5,850, పెసలు-రూ.7,755, మినుములు-రూ.6,600 గా ప్రభుత్వం నిర్ధారించింది. అన్నదాతలు సమీప ప్రభుత్వ మార్కెట్లలో పప్పు ధాన్యాలను విక్రయించాలని అధికారులు సూచిస్తున్నారు.