AP

జులైలో విశాఖ వెళ్తున్నాం..–: సీఎం జగన్…

జులైలో మనం విశాఖ వెళ్తున్నాం.. ఇక ఆలోచించాల్సిన పనిలేదు.. ఇదే ఫైనల్.. అంటూ సీఎం జగన్ మంత్రివర్గ సమావేశంలో పేర్కొన్నారు. దీంతో 7స్థానాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలను గెలవాలంటూ సూచించారు. ఏం తేడా వచ్చినా.. మంత్రివర్గంలో మార్పు తప్పదంటూ సీఎం జగన్ మంత్రులను హెచ్చరించారు. మీ పని తీరు గమనిస్తున్నా.. ఇకనైనా అలర్ట్ అవ్వండి అంటూ మంత్రులకు పలు కీలక సూచనలు చేశారు. ఏడెంటికి ఏడు ఎమ్మెల్సీలు గెలవాల్సిందేనంటూ పేర్కొన్న జగన్.. పలు విషయాలపై మంత్రులకు క్లారిటీ కూడా ఇచ్చారు.. కాగా.. త్వరలో విశాఖ వెళ్తామని గతంలో ఢిల్లీలో సీఎం జగన్ అన్నారు.. విశాఖలో జరిగిన ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్లోనూ విశాఖే రాజధాని అంటూ జగన్ పేర్కొన్నారు. ఈ తరుణంలో విశాఖకు తరలివెళ్లే నెలను కూడా సీఎం జగన్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

 

కాగా.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధ్యక్షతన మంగళవారం ఉదయం జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. 45 అజెండా అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించగా, అసెంబ్లీలో ప్రవేశపెట్టే 15 బిల్లులకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కొత్త ఇండస్ట్రియల్‌ పాలసీకి కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2023-27 పారిశ్రామిక విధానానికి సైతం కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. ముందుగా, స్పీకర్‌ తమ్మినేని సీతారాం అధ్యక్షతన ఏపీ బీఏసీ సమావేశం జరిగింది. 24 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఎసీ నిర్ణయించింది. 9 రోజులపాటు ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 16న బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు.