AP

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో అధికార వైసీపీ సభ్యుల సంఖ్య భారీగా పెరిగింది..

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో గెలుపుతో శాస‌న‌మండ‌లిలో వైఎస్సార్ సీపీ బ‌లం బాగా పెరిగింది…గత సార్వత్రిక ఎన్నిక‌ల స‌మ‌యానికి కేవ‌లం 9 మంది ఎమ్మెల్సీల‌ను మాత్రమే క‌లిగి ఉన్న వైసీపీ బ‌లం 45 కు చేరింది.. దీంతో పూర్తిస్థాయిలో కౌన్సిల్ లో ప‌ట్టు సాధించింది వైసీపీ.

 

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో అధికార వైసీపీ సభ్యుల సంఖ్య భారీగా పెరిగింది. 2019 లో అధికారంలోకి వచ్చే నాటికి వైసీపీకి కేవలం 9మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. దీంతో శాసన సభ ఆమోదం పొందిన బిల్లులు మండలిలో పాస్ కావడానికి అనేక ఇబ్బందులు ఎదురయ్యేవి. ప్రతిపక్ష సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని చట్టాలు కౌన్సిల్ ఆమోదం పొందలేకపోయాయి. దీంతో కొన్ని కీలక నిర్ణయాల్లో ప్రభుత్వం అడుగు ముందుకు వేయలేని పరిస్థితి వచ్చింది.

 

తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక సీట్ల గెలుపుతో వైసీపీ సభ్యుల బలం బాగా పెరిగింది. తాజాగా మొత్తం 21 స్థానాలకు వివిధ కోటాలో ఎన్నికలు జరిగాయి. స్థానిక సంస్థల కోటాలో 9 స్థానాలు వైసీపీ గెలుచుకుంది. టీచర్ల కోటాలో 2 స్థానాలు గెలుచుకోగా.. ఎమ్మెల్యే కోటాలో 6 స్థానాలు వైసీపీ గెలుచుకుంది. దీంతో మొత్తం 17 మంది అభ్యర్థులు పెరిగారు. దీంతో మొత్తంగా మండలిలో వైసీపీ సభ్యుల సంఖ్య 45 కి చేరుకుంది. ఇక టీడీపీ కొత్తగా గెలుచుకున్న 4 స్థానాలతో ఆ పార్టీ బలం కేవలం 10కి పరిమితం కానుంది. పీడీఎఫ్ నుంచి మొత్తం ఐదుగురిలో ఇద్దరు స్థానం కోల్పోయారు. ఆగస్టులో గవర్నర్ కోటాలో మరో రెండు ఎమ్మెల్సీలు వైసీపీ ఖాతాలోకి చేరనున్నాయి.