మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. సీబీఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణలో ఎందుకు జాప్యం జరుగుతుందని సీబీఐని నిలదీసిన సుప్రీం.. విచారణ అధికారిని మార్చాలని పేర్కొంది. ఇంకా విచారణ త్వరగా ముగించలేకపోతే మరో దర్యాప్తు అధికారిని ఎందుకు నియమించకూడదని సీబీఐని సుప్రీంకోర్డు ధర్మాసనం ప్రశ్నించింది. ఇక తదుపరి విచారణను ఏప్రిల్ 10వ తేదీకి వాయిదా వేసింది.