చాలా రోజుల తర్వాత హైదరాబాద్‌లో తెలుగు దేశం పార్టీ (టీడీపీ) పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. మొత్తం 17 అంశాలపై చర్చించారు. మహానాడు, ఎన్టీఆర్ శతజయంతి, ఎన్నికల మేనిఫెస్టో కోసం.. మూడు కమిటీలను వేశారు.పార్టీ కోసం కష్టపడినవారికి గుర్తింపు ఇవ్వడంతో పాటు… 40శాతం టికెట్లు యువతకే కేటాయించాలని నిర్ణయించారు. పొత్తులపై ఎన్నికల టైమ్‌లో చర్చిస్తామని చెప్పారు అచ్చెన్నాయుడు. తాము గ్రీన్ సిగ్నల్ ఇస్తే 40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.
పొత్తులపై నిర్ణయం తీసుకోలేదన్నది టీడీపీ వర్షన్. కానీ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు.. వైసీపీని ఓడించాలంటే టీడీపీ, జనసేన, లెఫ్ట్, కాంగ్రెస్ పార్టీలు కలిసిరావాలన్నారు.
వచ్చే మహానాడుని రాజమండ్రిలో జరపాలని నిర్ణయించారు. తెలంగాణలోనూ పార్టీని బలోపేతం చేయడంపై ఫోకస్ చేస్తోంది టీడీపీ. ప్రజాసమస్యలపై పోరాడటంతోపాటు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా వున్న 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ నిర్వహించాలని పొలిట్‌బ్యూరోలో నిర్ణయించారు.