AP

రక్షక బటుడి స్వచ్ఛంద సేవలను అభినందిస్తూ రాజకీయాలకు అతీతంగా కృష్ణారావును ఘనంగా సత్కరించి సన్మానించి గౌరవించిన గౌ, ఎమ్మెల్యే అలజంగి జోగారావు

రక్షక బటుడి స్వచ్ఛంద సేవలను అభినందిస్తూ రాజకీయాలకు అతీతంగా కృష్ణారావును ఘనంగా సత్కరించి సన్మానించి గౌరవించిన గౌ, ఎమ్మెల్యే అలజంగి జోగారావు గారు మరియు నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు

పార్వతీపురం ప్రాంతానికి చెందిన రక్షకబటుడు కృష్ణారావు పార్వతీపురం టౌన్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా ఒకవైపు విధులు నిర్వహిస్తూ మరోవైపు తన సంపాదనలో సగభాగం పేద ప్రజల సహాయార్థం ఖర్చు చేస్తూ నిరంతర సేవా గుణంతో పరితపిస్తూ ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ అవసరం వచ్చినా తానున్నానంటూ వారికి అండగా నిలుస్తూ, తనకు తోచిన చిరు సహాయాన్ని అందించి వారిలో ఆత్మస్థర్యాన్ని, మనో నిబ్బరాన్ని కల్పిస్తూ, ఆపద్బాంధవుడిలా నిలుస్తూన్నారు కృష్ణారావు.

ఇంతటి ఉత్తమ సేవా గుణం కలిగిన మానవ మూర్తిగా మన పార్వతీపురం మన్యం జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాలలో కూడా మంచి పేరుగాంచిన కృష్ణారావు సేవలను ఇప్పటికే గుర్తించిన స్థానిక ఎమ్మెల్యే శ్రీ అలజంగి జోగారావు గారు శనివారం నాడు పాత బస్టాండ్ కూడలి వద్ద జరిగిన భారీ బహిరంగ సభా వేదికపైకి కృష్ణారావును సాదరంగా ఆహ్వానించి అతని సేవలను కొనియాడుతూ పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా ఒక నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా తాను ఇంత మంది ప్రజా ప్రతినిధులుచే ప్రజల సమక్షంలో సత్కరించుకోవడం ఒక గొప్ప విషయంగా భావిస్తున్నామని ఎమ్మెల్యే తెలుపుతూ ప్రజా ప్రతినిదులతో కలిసి కృష్ణారావును దుస్సాలతో ఘనంగా సత్కరించి వారి సేవలను కొనియాడడం జరిగినది. ఈ కార్యక్రమంలో పలువురు నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, వేళ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.