AP

చందమామా అందింది.. ఇక మనమూ అక్కడకు వెళ్లొచ్చు.. ఖర్చెంతో తెలుసా?

చందమామ రావే… జాబిల్లి రావే… కొండక్కి రావే… కోటి పూలు తేవే…
ఇలా చిన్నప్పుడు పిల్లల్ని ఆడించడానికి, అన్నం తినిపించడానికి అబద్ధం చెప్పేవారు పెద్దలు.

కానీ ఇప్పుడు ఆ అబద్ధమే నిజమవబోతోంది. చందమామ మన కోసం కొండెక్కి రాకున్నా, కోటి పూలు పంపే క్షణాలు మాత్రం త్వరలోనే ఆవిష్కృతం కానున్నాయి. చంద్రయాన్‌ – 3 విజయవంతం అవడం ప్రతీ భారతీయుడు గుండె గర్వంతో ఉప్పొంగే క్షణం. కేవలం ఇప్పటి వరకు 3 దేశాలు మాత్రమే చంద్రుడి మీద అడుగుపెట్టగలిగాయి. అమెరికా, రష్యా, చైనా. నాలుగో దేశంగా భారత్‌ అవతరించింది. అంతేకాదు… దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశం మాత్రం మనదే. ఇప్పటి వరకు ప్రపంచంలో సాధ్యం కానిది మనం చేసి చూపించాం. ఈ మిషన్‌ కోసం భారత్‌ రూ.615 కోట్లు ఖర్చు చేసింది. అయితే ఇతర దేశాలు ఇటువంటి మిషన్ల కోసం ఇంతకన్నా ఎక్కువ మొత్తమే ఖర్చు చేశాయి.

మనిషిని.. పంపాలంటే..
చంద్రునిపైకి ఇంత ఖర్చు చేసిన మనిషి.. ఒక వ్యక్తిని లేదా ఏదైనా వస్తువును చంద్రునిపైకి పంపాలనుకుంటే అందుకు అయ్యే వ్యయం అధికంగా ఉంటుంది. ఏ దేశమైనా చంద్రునిపైకి వాటర్‌ బాటిల్‌ పంపాలనుకుంటే అందుకు అయ్యే ఖర్చు చాలా అధికంగా ఉంటుంది. 1972వ సంవత్సరంలో యూజీన్‌ సెర్నాన్‌ చంద్రుని ఉపరితలంపై నడిచాడు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఉన్నప్పుడు.. చంద్రుడిపైకి మనిషిని పంపాలని ప్లాన్‌ చేశారు. అయితే ఇందుకు అయ్యే వ్యయాన్ని అంచనా వేసినప్పుడు 1,04,000 అమెరికా డాలర్లు ఖర్చవుతుందని తేలింది. ఇంత భారీ మొత్తం వ్యయం చేసేందుకు అమెరికా వెనక్కి తగ్గింది.

వాటర్‌ బాటిల్‌ పంపాలంటే..
చంద్రునిపైకి మనిషిని పంపడానికి ఇంత భారీ మొత్తంలో ఖర్చవుతుందని తేలినప్పుడు ఒక వాటర్‌ బాటిల్‌ పంపాలంటే ఎంత ఖర్చవుతుందో తెలుసా.. నిజానికి ఇప్పటి వరకు అలాంటి ప్రయోగం జరగలేదు. అయితే ఒక వాటర్‌ బాటిల్‌ను సురక్షితంగా పంపడానికి, అంతరిక్ష నౌకలో ఉపయోగించే భద్రత, సాంకేతికత ఒక వ్యక్తిని చంద్రునిపైకి పంపిన రీతిలోనే ఉంటుంది. అయితే మనిషిని పంపడానికి అయ్యే వ్యయం కన్నా కాస్త తక్కువ ఉండవచ్చు. అయినా ఈ మొత్తం అధికంగానే ఉంటుంది. ఇంతమొత్తం ఖర్చు చేసేందుకు మన దేశానికి చెందిన బడా వ్యాపారవేత్తలైన అదానీ, అంబానీలే ఆలోచించాల్సి వస్తుంది.