టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఆదాయపన్ను (ఐటీ) శాఖ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. సబ్ కాంట్రాక్ట్ ల పేరుతో ముడుపులు తీసుకున్నారంటూ అభియోగాలు రాగా, గతంలోనే ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది.
ఇన్ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్ట్ ల ద్వారా రూ.118 కోట్ల ముడుపులు తీసుకున్నట్లు అభియోగాలు ఉన్నాయి. అయితే ఆ నోటీసులపై ఆయన తెలిపిన అభ్యంతరాలను ఐటీ శాఖ తిరస్కరించింది. ఆదాయపన్ను శాఖ అధికారులు ప్రాధమిక ఆధారాలను సేకరించినట్లుగా తెలుస్తొంది. మనోజ్ వాసుదేవ్ పార్ధసాని నివాసాల్లో తనిఖీల సమయంలో అసలు విషయం బయటపడింది. బోగస్ కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్ల ద్వారా నగదు స్వాహా చేసినట్లు మనోజ్ వాసుదేవ్ ఒప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి.
Advertisements
అతనే స్వయంగా టీడీపీ అధికారంలో ఉండగా 2017 నుండి 2019 వరకూ ఎన్ని కాంట్రాక్ట్ లు తీసుకుంది. డబ్బు ఎలా మార్చి ఇచ్చింది స్వయంగా స్టెట్మెంట్ ఇచ్చినట్లు చెబుతున్నారు. షాపూర్జి పల్లోంజీ (ఎల్ పీసీఎల్), ఎల్ అండ్ టీ నుండి సబ్ కాంట్రాక్ట్ ద్వారా ముడుపులు అందినట్లుగా తెలుస్తొంది. ఫొనిక్స్ ఇన్ప్రా అండ్ పౌర్ ట్రేడింగ్ అనే సబ్ కాంట్రాక్టు సంస్థ ద్వారా నగదు మళ్లించారని ఆరోపణలు వచ్చాయి. మనోజ్ వాసుదేవ్, పార్ధసాని నివాసాల్లో ఐటీ సోదాలు చేసే సమయంలో కొన్ని మెసేజ్ లు, ఛాట్ లు, ఎక్స్ ఎల్ షీట్లను కూడా సీజ్ చేసినట్లు తెలుస్తొంది. ఇక నిధులు మళ్లించినట్లు ఆధారాలు సేకరించిన ఐటి .. మళ్లిన ఆ నిధులు చంద్రబాబుకు చేరినట్లు అభియోగం నమోదు చేసింది. 2016లో ఆగస్టుల చంద్రబాబు సెక్రటరీ శ్రీనివాస్ తనను కలిసి పార్టీ ఫండ్ ఇవ్వాల్సిందిగా చెప్పినట్లు ఎంవీపీ ఐటీకి స్టేట్ మెంట్ ఇచ్చారు. 2016లో చంద్రబాబు పీఏ శ్రీనివాస్ తో పార్ధసారధి టచ్ లోకి వెళ్లారని చెబుతున్నారు.
శ్రీనివాస్ ద్వారానే సబ్ కాంట్రాక్ట్ ల సంస్థల నుండి ముడుపులు పొందినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఓ మీడియా సంస్థ బయటపెట్టింది. ఇది అక్రమ సంపాదన ఎందుకు కాదు అంటూ ఐటీ నోటీసులు ఇచ్చింది. చంద్రబాబుకు ఐటీ శాఖ 153 సీ నోటీసులు ఇవ్వగా, ఆగస్టు 4న ఆ నోటీసులకి సమాధానం ఇచ్చారుట, అయితే అభ్యంతరాలను తిరస్కరించినట్లుగా తెలుస్తొంది. బోగస్ సబ్ కాంట్రాక్ట్ ల ద్వారా బాబు లబ్దిపొందినట్లు వైసీపీ తొలి నుండి ఆరోపణలు చేస్తొంది. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి చంద్రబాబు హయాంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేయడంతో పాటు వివిధ రకాలుగా విచారణలు కూడా చేసింది. ఐటీ శాఖ వ్యవహారం ఎలా ఉన్నా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు బయటకు తీస్తామని, చంద్రబాబు అరెస్టు తప్పదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పలు సందర్భాల్లో పేర్కొన్నారు.