National

“అమెరికా” గోల్డెన్ టాయిలెట్ చోరీలో పురోగతి సాధించిన UK పోలీసులు..!!

2019వ సంవత్సరంలో బ్రిటన్ మాజీ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ పుట్టిన చోట 18 క్యారెట్ ల బంగారు టాయిలెట్‌ను తెల్లవారుజాము 5 గంటలకు దుండగులు చోరీ చేయడం తెలిసిందే.

గోల్డెన్ టాయిలెట్ స్టోరీ అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో ఆర్ట్ ఎగ్జిబిషన్ ప్రదర్శన కోసం ఉంచిన టాయిలెట్ చోరీ ఎత్తుకెళ్లింది ఎవరు అనేదానిపై దాదాపు మూడు సంవత్సరాల నుండి పోలీసులు విచారణ జరుగుతూ ఉంది. చోరి జరిగిన సమయంలో 66 సంవత్సరాల వయసు కలిగిన వృద్ధుడిని అప్పట్లో అరెస్టు కూడా చేయడం జరిగింది. “అమెరికా” అనే నామకరణం కలిగిన ఈ గోల్డెన్ టాయిలెట్ నీ న్యూయార్క్ లో ప్రదర్శనకు పెట్టినప్పుడు పెద్ద సంఖ్యలో దాన్ని చూడటానికి జనం అప్పట్లో రావడం జరిగింది.

Advertisements

కాగా 2019లో విన్‌స్టన్ చర్చిల్ పుట్టిన పుట్టిన ప్రదేశంలో..బ్లెన్ హెయిమ్ ప్యాలెస్ లో చెక్కతో తయారు చేసిన గదిలో.. ఈ 18 క్యారెట్ల బంగారు టాయిలెట్ ప్రదర్శన కోసం ఉంచడం జరిగింది. అటువంటి చిన్న గదిలో.. ఉన్న ఈ విలువైన వస్తువును దోచేశారు. దీంతో ఎవరు చోరీ చేశారు అన్నదానిపై సమాచారం అందించాలని అప్పట్లో ఎగ్జిబిషన్ నిర్వాహకులు తెలియజేశారు. ఇదే రీతిలో అప్పటి ఎగ్జిబిషన్ లో చాలా వస్తువులు ఉండటం జరిగింది. ఈ క్రమంలో గోల్డెన్ టాయిలెట్ చోరీ జరిగిన సమయంలో ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లోని వుడ్‌స్టాక్‌లో ఉన్న బ్లెన్‌హెయిమ్ ప్యాలెస్‌ నుంచీ పోలీసులకు సమాచారం అందింది.

అప్పటినుంచి ఈ చోరీపై విచారణ చేస్తున్న UK పోలీసులు తాజాగా పురోగతి సాధించారు. గోల్డెన్ టాయిలెట్ చోరీలో ఒక మహిళతో పాటు ఆరుగురు పురుషులను అరెస్టు చేసినట్లు స్పష్టం చేశారు. ఈ ఏడుగురే చోరీకి పాల్పడినట్లు అనుమానంతో అరెస్టు చేశామని స్పష్టం చేశారు. అయితే దుండగులను అరెస్టు చేసిన వారి దగ్గర నుండి “అమెరికా” అనబడే గోల్డెన్ టాయిలెట్ నీ కనుగొనలేకపోయారు. ఈ గోల్డెన్ టాయిలెట్ ఖరీదు దాదాపు 6 మిలియన్ ల డాలర్లు అని పరిశోధకులు తెలియజేస్తున్నారు. మరి యూకే పోలీసులు పట్టుకున్న దుండగులు.. “అమెరికా” గోల్డెన్ టాయిలెట్ జాడ విచారణలో చెబుతారో లేదో చూడాలి.