National

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సీనియర్ ఐఏఎస్ అనురాగ్ శ్రీవాస్తవని ముగ్గురు వ్యక్తులు బ్లాక్ మెయిల్‌

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సీనియర్ ఐఏఎస్ అనురాగ్ శ్రీవాస్తవని ముగ్గురు వ్యక్తులు బ్లాక్ మెయిల్‌కు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బ్యాంక్‌ కార్డును క్లోనింగ్ చేసి ఆయన ఖాతా నుంచి రూ.50,00 డ్రా చేసినందుకు ముగ్గురు వ్యక్తులను ఉత్తరప్రదేశ్ పోలీసుల సైబర్ బృందం అరెస్టు చేసింది.

ఐఏఎస్ అధికారి శ్రీవాస్తవ ఈమెయిల్‌ను హ్యాక్ చేసి బ్లాక్ మెయిల్ చేశారని పోలీసులు తెలిపారు. అరెస్టయిన ముగ్గురిని అమిత్ ప్రతాప్ సింగ్, హార్దిక్ ఖన్నా, రజనీష్ నిగమ్ గా గుర్తించారు. ముగ్గురూ అనురాగ్ శ్రీవాస్తవకు చెందిన నమామి గంగే కార్యాలయంలోని ఐటీ సెల్‌లో పనిచేసేవారు వారని.. ఐఏఎస్ అధికారితో పాటు అతని కుటుంబ సభ్యుల ఇమెయిల్‌లను హ్యాక్ చేసి, వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తామని బెదిరించారని పోలీసులు తెలిపారు. అరెస్టయిన ముగ్గురు హ్యాకర్లు శ్రీవాస్తవ నుంచి రూ.80 లక్షల బిట్‌కాయిన్‌లను డిమాండ్ చేశారు. ఈ నేరానికి సూత్రధారి రజనీష్ నిగమ్ అని, అతడు ఐటీ సెల్ హెడ్ అని పోలీసులు తెలిపారు. అనురాగ్ శ్రీవాస్తవ లక్నోలోని సైబర్ పోలీస్ స్టేషన్‌లో హ్యాకింగ్, బ్లాక్ మెయిల్ చేసినందుకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.