CINEMA

సూపర్ స్టార్ రెమ్యునరేషన్ 210 కోట్లు. 100 కోట్ల సింగల్ చెక్

ఇండియాలోని ప్రతి ఇండస్ట్రీకి ఒక స్టార్ హీరో ఉంటాడు, సూపర్ స్టార్ ఇమేజ్ తో యావరేజ్ సినిమాలని కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ గా మారుస్తూ ఉంటాడు. ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోకి ఒకటి రెండు ఫ్లాప్స్ పడినా మార్కెట్ విషయంలో జరిగే నష్టమేమి ఉండదు.

హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీల్లో ఇలాంటి స్టార్ హీరోలు చాలా మందే ఉన్నారు. అయితే ఏ ఇండస్ట్రీకి ఎంత మంది స్టార్ హీరోలు ఉన్నా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తానికి కలిపి ఒకడే స్టార్ హీరో ఉన్నాడు, అతని పేరు సూపర్ స్టార్ రజినీకాంత్. రజినీకాంత్ కన్నా బాగా నటించే వాళ్లు ఉన్నారు, ఆయన కన్నా అందమైన వాళ్లు ఉన్నారు, యంగ్ అండ్ చార్మింగ్ హీరోలు కూడా ఉన్నారు కానీ రజినీకాంత్ కి ఉన్న చరిష్మాని మ్యాచ్ చేసే హీరో, ఆయన ఆరాని మ్యాచ్ చేసే హీరో మాత్రం లేడు. 40-50 ఏళ్లకి స్టార్ హీరోలయ్యి 200-300-400 కోట్లు కలెక్ట్ చేసి పాన్ ఇండియా హీరోలుగా పేరు తెచ్చుకుంటున్న ఈ కాలంలో 78 ఏళ్ల వయసులో కూడా ఒక యావరేజ్ సినిమాతో 650 కోట్లు రాబట్టాడు అంటే రజినీ రేంజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.

అందరూ తమ ఫేవరెట్ హీరోల సినిమా రిలీజ్ అయితే కాలేజ్ కి, ఆఫీస్ కి సెలవు పెడతారు… రజినీ సినిమా వస్తుంది అంటే స్కూల్స్, కాలేజస్, ఆఫీసులు అనే తేడా లేకుండా కంపెనీలు కూడా స్వచ్ఛందంగా సెలవలు ప్రకటిస్తాయి. ఆ విషయంలో రజినీకాంత్ నిస్సందేహంగా ఇండియాస్ మోస్ట్ సెలబ్రెటెడ్ స్టార్ హీరో అనే చెప్పాలి. 80ల్లో పుట్టిన వాళ్ల దగ్గర నుంచి ఈ జనరేషన్ ఆడియన్స్ వరకూ ప్రతి ఒక్కరినీ తన మాయలో పడేస్తున్న రజినీకాంత్ ఒక సినిమా వంద కోట్లకి పైగా రెమ్యునరేషన్ తీసుకుంటాడు.జైలర్ సినిమాకైతే దాదాపు 110 కోట్లు తీసుకున్నట్లు సమాచారం, లేటెస్ట్ గా జైలర్ సినిమా ప్రొడ్యూసర్ రజినీకాంత్ ని కలిసి 100 కోట్ల సింగల్ చెక్ ఇచ్చాడు. దీంతో కలిపితే జైలర్ సినిమాకి రజినీకాంత్ 210 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు. ఇండియాలో ఏ స్టార్ హీరోకి ఈ స్థాయిలో రెమ్యునరేషన్ ఇవ్వలేదు. అందుకే ఇండియాలో ఒకడు సూపర్ స్టార్… వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్.