National

ఈ నెల 8న ప్రధాని మోదీ ,బైడెన్ భేటీ – కీలక ఒప్పందాలు..!!

సెప్టెంబర్‌ 9-10 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న జి 20 సదస్సుకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హాజరుకున్నారు. అయితే ఈ సదస్సు జరగబోయే రెండురోజుల ముందే జో బైడెన్‌ భారత్‌కి చేరుకోనున్నట్లు వైట్‌ హైస్‌ వెల్లడించింది.

సెప్టెంబర్‌ 8వ తేదీ శుక్రవారం అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, భారత ప్రధాని మోడీతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొనున్నారని శ్వేతసౌథ స్పష్టత ఇచ్చింది. భారత్ అధ్యక్షత వహిస్తున్న జీ-20 సమావేశాలు ఈ నెల 9,10 తేదీల్లో ఢిల్లీలో జరగనున్నాయి.

సెప్టెంబర్‌ 9-10 తేదీల్లో జరగనున్న జి – 20 సదస్సులో బైడెన్‌ పాల్గొనున్నట్లు వైట్‌ హౌస్‌ ప్రకటన తెలిపింది. కాగా, జి20 శిఖరాగ్ర సమావేశంలో స్వచ్ఛమైన ఇంధన పరివర్తన, వాతావరణ మార్పులతో సహా ప్రపంచ సమస్యల్ని పరిష్కరించడానికి జి 20 దేశాల భాగస్వాములతో కలిసి బైడెన్‌ చర్చించనున్నట్లు వైట్‌ హౌస్‌ పేర్కొంది.

భారత్ పర్యటనలో భాగంగా ఈనెల 7వ తేదీన బైడెన్ ఢిల్లీకి బయలుదేరుతారు. 8న మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 9, 10 తేదీల్లో జి 20 సమావేశాల్లో పాల్గొంటారు. అంతర్జాతీయ అంశాల్లో ఉమ్మడి కార్యాచరణ పై అందులో చర్చలు జరుగుతాయి.

శుద్ధ ఇంధనం, ఇంధన పరివర్తనం, వాతావరణం మార్పులపై పోరాటం వంటి అంశాలపై నేతలు చర్చిస్తారు.ఒక రైన్ లో రష్యా యుద్ధం కారణంగా పడిన ఆర్థిక, సామాజిక ప్రభావాల పైన చర్చలు జరుగుతాయి. ప్రపంచ బ్యాంకు సహా బహుళ అభివృద్ధి బ్యాంకుల సామర్థ్యాన్ని పెంచి పేదరికంపై మరింత గట్టిగా పోరాడేందుకు కార్యాచరణను ఈ ఇద్దరి చర్చల్లో నిర్ణయం చేస్తారని శ్వేత సౌధం చెప్పుకొచ్చింది.