AP

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్ ఆహ్వానించిన టీటీడీ..

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు రావాలని ముఖ్యమంత్రి జగన్ ను డిఫ్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, టీటీడీ ఛైర్మన్ భూమన కరణాకర్ రెడ్డి, ఈఓ ధర్మారెడ్డి ఆహ్వానించారు.

జగన్ కు ఆహ్వాన పత్రికతో పాటు వెంకటేశ్వరస్వామి శేషవస్త్రం, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ను వేద పండితులు ఆశీర్వదించారు. తిరుమలలో సెప్టెంబర్ 18 నుంచి 26 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.

ఇందుకు సంబంధించి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని ఆగమోక్తంగా టీటీడీ పూర్త చేసింది. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సంవత్సరానికి నాలుగుసార్లు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మెత్సవాలు, వైకుంఠ ఏకాదశి రోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు.

l

మరోవైపు తిరుమలకు కాలినడక వెళ్లే మార్గంలో నిబంధనలు కొనసాగుతోన్నాయి. నడక మార్గంలో వన్యమృగాల సంచారం తగ్గేవరకు ఆంక్షాలు కొనసాగుతాయని సీసీఎఫ్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. అలిపిరి నడక మార్గంలో నిఘా కొనసాతుందని చెప్పారు. నడక మార్గంలో ఎలుగుబంట్లు, చిరుత పులులు ఉన్నట్లు ట్రాప్ కెమెరా ద్వారా గుర్తించినట్లు వివరించారు. ఇంకా ఐదు చిరుతలు నడక మార్గంలో తిరుగుతున్నాయని.. వాటిని బంధించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు.

ఇప్పిటికే ఐదు చిరుతలను బంధించినట్లు వివరించారు. నడక మార్గంలో ఇరువైపుల అటవీ ప్రాంతాన్ని చదును చేసినట్లు తెలిపారు. మంగళవారం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 17 గంటల సమయం పడుతోంది. నిన్న 66,199 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.