స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వైసీపీ ప్రభుత్వంపై తాజాగా ప్రముఖ నటుడు షాకింగ్ కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది.
చిన్న సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో శ్రీకాంత్ అయ్యంగర్ కూడా ఒకరు. ఇటీవల విడుదలైన ప్రతి సినిమాలోనూ శ్రీకాంత్ భరత్ దర్శనం ఇస్తున్నారు.
తాజాగా ఆయన ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.తనకు మద్యం తాగే అలవాటు ఉందని..ఒకవేళ తన చానిపోతే.. కల్తీ మద్యమే కారణమంటూ ఓ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశారు. అయితే తాను ఏపీలో మద్యం బూమ్ బూమ్ బీర్ తెచ్చి తాగుతున్నానని..గతిలేకనే ఈ బీర్ తెచ్చుకున్నానని కన్నీరు పెట్టుకున్నారాయన. చెప్పలంటే ఒకరకంగా వైసీపీ ప్రభుత్వంపై ఆయన వెటకారంగా ఈ వీడియోను పెట్టినట్టు స్పష్టం అవుతుంది.
ఏపీలో మద్యం తాగితే చావు ఖాయం అనే విధాంగా నటుడు శ్రీకాంత్ అయ్యంగర్ మాట్లాడారు. ఇటీవలే ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఏపీలో మద్యం తాగే మరణించారనే విమర్శలు వచ్చాయి. బూమ్ బూమ్ బీర్లు తాగడం వల్లే..ఆయన చనిపోయారని అప్పట్లో వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే రాకేష్ మాస్టర్ ఆరోగ్యం క్షీణించడంతోనే మరణించారని డాక్టర్లు ప్రకటించారు. దాంతో ఆ వివాదం సర్దుమణిగింది. తాజాగా శ్రీకాంత్ అయ్యంగర్ మరొసారి ఏపీ మద్యం గురించి కామెంట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఏపీలో నాసిరకం మద్యం సరఫరా అవుతుందన్న విమర్శ ఎప్పటి నుంచో ఉంది. దేశంలో ఎక్కడా చూడని బ్రాండ్లు ఏపీలో దర్శనమిస్తున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విమర్శలను వైసీపీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు. తాజాగా నటుడు శ్రీకాంత్ అయ్యంగర్ చేసిన కామెంట్స్ ఏపీలో కాకరేపుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.