జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి ఫ్యామిలీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి..
పాపం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఆరోగ్యం బాగోలేదు.. మతి లేదు పాపం ఆయనకు అంటూ ఎద్దేవా చేశారు. ఇక, తాడిపత్రి మున్సిపాలిటీ అభివృద్ధికి అనునిత్యం అడ్డుపడుతుంది జేసీ దివాకర్ రెడ్డి తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డేనని ఆరోపించారు.. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు, కాలేజ్ కాంపౌండ్ కు.. ఇలా ప్రతి దానికి అడ్డం పడుతున్నారని మండిపడ్డారు. HLC కాలువకు నీళ్లు వస్తున్నా.. మళ్లీ పోయి ఎస్‌ఈని అడుగుతున్నారు. రోజుకు 250 క్యూసెక్కుల నీరు వెళ్తున్నాయి. నిన్న పెద్ద వడగూరు కూడా నీరు వెళ్తున్నాయని వెల్లడించారు.
మరోవైపు.. నారా భువనేశ్వరి.. చంద్రబాబు చేసిన పాపాలకు ప్రాయచ్చితం కోసం యాత్రలు చేస్తున్నారని సెటైర్లు వేశారు ఎమ్మెల్యే కేతిరెడ్డి.. మేం కూడా నిజం గెలవాలి అని కొరుకుంటున్నామన్న ఆయన.. చంద్రబాబు జైలుకు వెళ్తాడు అని ముందే తెలుసు.. అందుకే చెక్కులపై ముందే సంతకాలు చేసి భువనేశ్వరి ద్వారా వాటిని పంచుతున్నారని విమర్శలు గుప్పించారు.. ఇక, జేసీ దివాకర్ రెడ్డి ఒక పనికిమాలిన వ్యక్తి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. జేసీ ఫ్యామిలీ 30 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉండి నీళ్లు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. కాగా, జేసీ ఫ్యామిలీ.. కేతిరెడ్డి ఫ్యామిలీ మధ్య నిత్యం ఏదో ఓ రూపంలో ఘర్షణ వాతావరణం ఉంటుందనే విమర్శలు ఉన్న విషయం విదితమే.