AP

పండగ తరువాతే.. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు..

చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు ఇప్పట్లో వచ్చేటట్టు కనిపించడం లేదు. మిగతా కేసుల విషయంలో అత్యున్నత న్యాయస్థానం తీర్పులే దీనిని తెలియజేస్తున్నాయి. అవినీతి కేసుల్లో చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుకు.. సుదీర్ఘ విరామం తర్వాత బెయిల్ లభించింది. అయితే తన కేసుల విషయంలో నిబంధనలు పాటించలేదని.. గవర్నర్ అనుమతి తీసుకోలేదని.. అందుకే ఆ కేసులను కొట్టివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. తీర్పు రిజర్వ్ అయింది. కానీ ఇంతవరకు తీర్పు వెల్లడించలేదు.

 

More

From Ap politics

అటు మిగతా కేసుల విచారణను సైతం అత్యున్నత న్యాయస్థానం వాయిదా వేస్తోంది. తాజాగా ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు జనవరి 17వ తేదీకి వాయిదా వేసింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన చంద్రబాబు పిటిషన్ పై విచారణ కూడా జనవరి 19కి వాయిదా పడింది. అప్పటికి క్వాష్ పిటిషన్ పై తీర్పు రాకుంటే.. ఈ కేసుల విచారణ వాయిదా పడే అవకాశం ఉంది. అయితే ఈ లెక్కన సంక్రాంతి తర్వాతే అత్యున్నత న్యాయస్థానం క్వాష్ పై తీర్పు వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

తాజాగా ఫైబర్ నెట్ కేసులు చంద్రబాబు దాఖలు చేసుకున్నా బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది. అయితే బెయిల్ పై బయటకు వచ్చిన చంద్రబాబు కోర్టు ఆదేశాలను పాటించడం లేదని ఏసీబీ న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై చంద్రబాబు తరుపు లాయర్ సిద్ధార్థ లూథ్ర బలమైన వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున వాదించిన అడ్వకేట్ జనరల్ తో పాటు సిఐడి డీజీ పలు నగరాల్లో మీడియా సమావేశాల్లో మాట్లాడి కేసుల వివరాలను, సున్నితమైన అంశాలను బయట పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు.ఏకంగా ఆరోపణలు చేసిన వైనాన్ని ప్రస్తావించారు.దీనిపై న్యాయమూర్తి స్పందించారు. ఆ వివరాలను సుప్రీంకోర్టు ముందు ఉంచాలని.. ప్రత్యేకంగా దరఖాస్తు పెట్టుకోవాలని సూచిస్తూ కేసు విచారణను జనవరి 17 వాయిదా వేశారు.

 

తాను దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ పై సానుకూల తీర్పు వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. సుదీర్ఘ వాదనలు కొనసాగిన తర్వాత అక్టోబర్ 18న తీర్పును రిజర్వ్ అయ్యింది. అప్పటినుంచి అదిగో ఇదిగో అంటూ కాలం నడిచింది. కానీ తీర్పు వెల్లడించలేదు. మిగతా కేసుల విచారణ సమయంలో.. చంద్రబాబు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ పై తీర్పు తర్వాతే విచారణ చేపడతామని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. కానీ ప్రతి విచారణలో ఇదే విషయాన్ని చెప్పుకొస్తోంది. తుది తీర్పు మాత్రం వెల్లడించడం లేదు. తీర్పు కోసం టిడిపి వర్గాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. అయితే సంక్రాంతి తరువాతే తీర్పు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి