AP

టీడీపీకి గల్లా జయదేవ్ గుడ్ బై..

తెలుగుదేశం పార్టీ తన శక్తి యుక్తులను ప్రదర్శిస్తోంది. జనసేనతో కలిసి ఎలాగైనా జగన్ అధికారం నుంచి దూరం చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇటువంటి కీలక సమయంలో సిట్టింగ్ ఎంపీ ఒకరు పార్టీని వీడతారని ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మూడు ఎంపీ స్థానాలను గెలుచుకుంది. గుంటూరు, విజయవాడ, శ్రీకాకుళం లోక్సభ స్థానాలను కైవసం చేసుకుంది. గుంటూరు నుంచి గల్లా జయదేవ్, విజయవాడ నుంచి కేశినేని నాని, శ్రీకాకుళం నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు గెలుపొందారు. ముగ్గురు కూడా హేమాహేమీలే. అయితే ఇందులో ఒకరు పార్టీని వీడుతారని ప్రచారం జరుగుతుండడం శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది.

 

More

From Ap politics

టిడిపి తో జనసేన పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. బిజెపి సైతం ఆ రెండు పార్టీలతో కలుస్తుందని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే మూడు పార్టీలకు ఎంపి స్థానాలు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా జనసేనకు రెండు ఎంపీ స్థానాలు కేటాయిస్తారని టాక్ నడుస్తోంది. కానీ బిజెపి విషయం స్పష్టత వచ్చాకే దీనిపై ఒక క్లారిటీ రానుంది. ఒకవేళ బిజెపి కానీ చేరితే.. ఎమ్మెల్యేల కంటే ఎంపీ స్థానాలని కేటాయించాల్సి ఉంటుంది. దీనికి టిడిపి సైతం మానసికంగా సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.

 

ఇటువంటి పరిస్థితుల్లో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పార్టీని వీడుతారని సమాచారం. అయితే ఆయనకు వేరే పార్టీలో చేరాలని ఉద్దేశం లేకపోయినా.. పూర్తిగా రాజకీయాలకే దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా పార్టీ వ్యవహారాలకు ఆయన దూరంగా ఉన్నారు. కనీసం నియోజకవర్గంలో సైతం కనిపించడం లేదు. ప్రస్తుత రాజకీయాలు తనకు సరిపడడం లేదని జయదేవ్ తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.

 

గల్లా జయదేవ్ ది పూర్తి రాజకీయ నేపథ్య కుటుంబం. ఆయన తల్లి గల్లా అరుణకుమారి వైయస్ క్యాబినెట్లో మంత్రిగా కూడా వ్యవహరించారు. మరోసారి ఆమె టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అందుకే జయదేవ్ తప్పుకొని వ్యాపారాలను చూసుకుంటారని సమాచారం. ఆయన తండ్రి గల్ల రామచంద్ర నాయుడు పారిశ్రామిక వ్యాప్తంగా సుపరిచితం. అమర్ రాజా కంపెనీని స్థాపించి ఉద్యోగ ఉపాధిని కల్పించారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం ఉక్కు పాదం మోపడంతో తమ పరిశ్రమలను తెలంగాణ వైపు తరలించారు. ఈ తరుణంలో రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న గల్లా జయదేవ్ తప్పుకోవాలని చూస్తుండడం విశేషం. అయితే తన తల్లిని రాజకీయాల్లో విడిచిపెట్టి.. వ్యాపార రంగంలో కొనసాగాలని జయదేవ్ చూస్తున్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటారే తప్ప.. టిడిపికి మాత్రం దూరం కారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.