AP

మంత్రికి జగన్ మార్క్ షాక్ – బుట్టాకు ఎమ్మెల్యే, ఎంపీ సీటు ఖరారు..!!

సీఎం జగన్ ఎన్నికల వేళ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వైసీపీ ఇంఛార్జ్ ల ఖరారు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇంఛార్జ్ లను ప్రకటించిన నియోజకవర్గాల్లోనూ అవసరమైతే మళ్లీ మార్పుల కు సిద్దం అవుతున్నారు. కర్నూలు మంత్రి గుమ్మనూరు జయరాంకు ఎంపీ సీటు కేటాయించారు. ఆయన టీడీపీతో టచ్ లోకి వెళ్లారని సమాచారం. దీంతో, జగన్ వెంటనే షాక్ ఇచ్చారు. ఆయన స్థానంలో ఎంపీ అభ్యర్దిని ఖాయం చేసారు. మాజీ ఎంపీని ఎమ్మెల్యేగా బరిలోకి దింపుతున్నారు.

 

మారుతున్న లెక్కలు : వచ్చే ఎన్నికల్లో గెలుపే ప్రామాణికంగా సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని సీఎం జగన్ అభ్యర్దులను ఖరారు చేస్తున్నారు. కర్నూలు జిల్లా నుంచి ప్రస్తుత మంత్రి గుమ్మనూరి జయరాంను వచ్చే ఎన్నికల్లో కర్నూలు ఎంపీగా పోటీ చేయించాలని జగన్ భావించారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కానీ, జయరాం తాను ఎంపీగా పోటీ చేయాలంటే తన కుమారుడుకు ఆలూరు సీటు ఇవ్వాలని వైసీపీ ముఖ్య నేతల వద్ద ప్రతిపాదించారు. అందుకు పార్టీ సుముఖత వ్యక్తం చేయకపోవటంతో టీడీపీతో టచ్ లోకి వెళ్లినట్లు ప్రచారం సాగుతోంది. నిర్ణయం తీసుకునే ముందు పార్టీ సమన్యయకవర్త సుబ్బారెడ్డి పలుమార్లు జయరాంతో మాట్లాడేందుకు ప్రయత్నాలు చేసారు. కానీ, జయరాం అందుబాటులోకి రాలేదు. దీంతో, తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

 

ఎంపీ అభ్యర్దిగా రామయ్య : సీఎం జగన్ వెంటనే జయరాం స్థానంలో కర్నూలు మేయర్ బీవై రామయ్యను కర్నూలు ఎంపీగా పోటీ చేయించాలనే నిర్ణయానికి వచ్చారు.నిర్ణయం తీసుకునే ముందు పార్టీ సమన్యయకవర్త సుబ్బారెడ్డి పలుమార్లు జయరాంతో మాట్లాడేందుకు ప్రయత్నాలు చేసారు. కానీ, జయరాం అందుబాటులోకి రాలేదు. దీంతో, తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థిగా మాచాని వెంకటేష్ కు ఇస్తూ కొద్ది రోజుల క్రితం నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఆయన అభ్యర్దిత్వం పట్ల స్థానిక పార్టీ నుంచి వ్యతిరేకత వచ్చింది. దీంతో, మరోసారి పార్టీ ముఖ్య నేతలు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, ఆయన కుమారుడితో చర్చలు చేసారు. ఎమ్మిగనూరు నుంచి మాజీ ఎంపీ బుట్టా రేణుకను బరిలోకి దించాలని నిర్ణయించారు.

 

మాజీ ఎంపీకి ఎమ్మెల్యే సీటు : రేణుకు సహకారం అందించేందుకు చెన్నకేశవ రెడ్డి అంగీకరించారు. దీంతో, మాజీ ఎంపీ బుట్టా రేణుకకు ఎమ్మెల్యే సీటు ఖాయమైనట్టే. కర్నూలు ఎంపీగా రామయ్య పేరు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అదే విధంగా జిల్లాలో కర్నూలు సిటీ, నంద్యాల ఎంపీ అభ్యర్దులను ఖరారు చేయాల్సి ఉంది. వీటి పైన సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. కర్నూలు సిటీ సీటును మాజీ ఎమ్మెల్యే మోహన రెడ్డి ఆశిస్తున్నారు. నంద్యాల లోక్ సభ స్థానం మైనార్టీలకు కేటాయిస్తారని చెబుతున్నారు. ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఈ నియోజకవర్గాలకు సంబంధించి అధికారిక నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది.