AP

చొక్కా మడతేయండి, “సైకిల్” బయట..”గ్లాస్” షింకులో వేయాలి – జగన్ గర్జన..!

వైసీపీ రాపప్తాడు సిద్దం సభకు జనం హోరెత్తారు. ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. తన పాలనలో అమలు చేసిన సంక్షేమాన్ని వివరించారు. ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలన్నారు. సైకిల్ ఎప్పుడూ బయటే ఉండాలని పేర్కొన్నారు. తాగేసిన టీ ట్లాస్ షింక్ లోనే ఉండాలంటూ టీడీపీ, జనసేన గుర్తుల గురించి వివరించారు. మరోసారి చొక్కా మడతేయటానికి సిద్దమా అని ప్రశ్నించారు. చంద్రబాబు కుర్చీలు మడతేసి..చీపుర్లతో ఊడ్చి వారిని మరోసారి ఇంటికి పంపిద్దామంటూ జగన్ పిలుపునిచ్చారు.

 

జగన్ వ్యాఖ్యలు : ముఖ్యమంత్రి జగన్ రాప్తాడు సిద్దం సభలో చంద్రబాబు లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేసారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన వ్యక్తి చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్క పథకమైనా గుర్తుకు వస్తుందా అని ప్రశ్నించారు. చంద్రబాబు పేరు చెబితే మీ పేరు చెబితే వెన్నుపోటులే గుర్తుకు వస్తాయన్నారు. నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ తో మనకు యుద్దం జరుగుతోందని చెప్పుకొచ్చారు. ఏ గ్రామంలో అయినా చంద్రబాబు మార్క్ ఉందా అని జగన్ నిలదీసారు. ఏ ఎన్నికల్లో అయినా ఇచ్చిన హామీలు అమలు చేసారా అని సీఎం ప్రశ్నించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయటం అంటే ప్రతీ పేదవాడు ఇంగ్లీషులో చదవటం.. సైకిల్ కు ఓటు వేస్తే ప్రభుత్వ బడులను మూసివేయటమేనని చెప్పుకొచ్చారు. ప్రతీ ఇంటికి వెళ్లండి. ప్రతీ ఒక్కరికి వివరించండంటూ జగన్ సూచించారు.

 

ప్రతీ ఇంటికి వెళ్లండి : 57 నెలల వైసీపీ కాలంలో అమలు చేసిన పథకాలు చెప్పాలి..వాటి కొనసాగింపు ఎంత అవసరమో చెప్పాలని జగన్ కోరారు. పెన్షన్ పెంచి వాలంటీర్ల ద్వారా ప్రతీ నెల ఒకటో తేదీన అందిస్తున్న విధానం గురించి గుర్తు చేయాలని సూచించారు. భవిష్యత్ లో పెన్షన్ పెరగాలన్నా..కొనసాగాలన్నా ఫ్యాన్ కే ఓటు వేయాలని చెప్పాలని జగన్ చెప్పుకొచ్చారు. వాలంటీర్ల వ్యవస్థ కొనసాగాలంటే వైసీపీ ప్రభుత్వంలోనే సాధ్యమని వివరించాలన్నారు. ప్రతీ అవ్వా, ప్రతీ తాత స్టార్ క్యాంపెయినర్లు కావాలని పిలుపునిచ్చారు. జరుగుతున్న మంచి కొనసాగాలంటే ప్రభుత్వం కొనసాగాలని సూచించారు. గ్రామాల్లో ఉన్న ప్రతీ ఒక్కిరికీ వైసీపీ ప్రభుత్వం అండగా నిలిచిందని చెప్పారు. ప్రతీ పేదవాడి ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసా ఇచ్చిందని వివరించారు.

 

స్టార్ క్యాంపెయిన్లుగా : ఏ గ్రామంలోకి వెళ్లినా వైఎస్సార్సీపీ ప్రభుత్వ మార్క్ కనిపిస్తుందని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రతీ ఇంటికి మంచి అనేది వైసీపీ ప్రభుత్వ హాయంలోనే జరిగిందని చెప్పుకొచ్చారు. 57 నెలల కాలంలో ఎలాంటి అవినీతి, వివక్ష లేకుండా ప్రతీ లబ్దిదారుడికి రూ 2.55 లక్షల కోట్లు అందించామని వివరించారు. ప్రతీ గ్రామంలో, ప్రతీ ఇంటా వైఎస్సార్సీపీ మార్క్ కనిపిస్తుందని చెప్పారు. ప్రజలు మనకు తొలి సారి ఆశీర్వదిస్తేనే ఇంత మంచి చేసామని..ప్రజలు మరోసారి అవకాశం ఇస్తే ఎంత మంచి జరుగుతుందనేది వివరించాలన్నారు. ప్రతీ అడుగులో సామాజిక న్యాయం అమలు చేస్తున్న తీరు గురించి ప్రతీ ఒక్కరు గుర్తించాలని సీఎం జగన్ కోరారు. ప్రతీ ఇంటికి మేలు చేసేలా అమలవుతున్న సంక్షేమం – సామాజిక న్యాయం కోసం వైసీపీకి మద్దతుగా నిలిచేలా ప్రతీ ఇంటికి వెళ్లి వివరించాలని సీఎం జగన్ సూచించారు.