AP

జెండాలు జత కట్టడమే వారి ఏజెండా – సీఎం జగన్..

వైసీపీ అధినేత, సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ‘మేమంత సిద్ధం’ పేరిట జగన్ బస్సు యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ఎమ్మిగనూరు సహా పలు ప్రాంతాల్లో బస్సు యాత్ర చేపట్టారాయన.ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. ఇక సాయంత్రం ఎమ్మిగనూరులో మేమంతా సిద్ధం సభలో జగన్ ఉద్వేగభరితంగా ప్రసంగించారు.

 

రైతన్నలను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ‎నే అని అన్నారు. ప్రతి అక్కాచెల్లెమ్మ గుర్తుపెట్టుకోండి.. ఈ ఎన్నికలే మీ భవిష్యత్తును డిసైడ్ చేయబోతున్నాయి అని జగన్ వ్యాఖ్యానించారు. అక్కాచెల్లెమ్మలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని, నేరుగా వారి అకౌంట్లలోనే డబ్బులు పడుతున్నాయని చెప్పారు. రూ.3 వేలు పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనదేనని జగన్ చెప్పారు. పొత్తులు, జిత్తులు, కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొంటూ పేదలకు అండగా నిలిచేందుకు నేను సిద్ధంగా ఉన్నాను.

జెండాలు జత కట్టిన పెత్తందార్లను ఓడించేందుకు మీరు సిద్ధమా?” అని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో పేదల వ్యతిరేకులను ఓడించండి… ఎన్నికల్లో గెలిచేది మనమే… ఏ కుట్రలూ మనల్ని అడ్డుకోలేవు అని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక పార్టీలకు సమాధి కట్టాలని అన్నారు. బాబు తోకను, తోకలను కత్తిరించాలని వ్యాఖ్యానించారు. పేదల సంక్షేమం కోసం వైసీపీని గెలిపించాలని జగన్ కోరారు.

 

త్తులను, జిత్తులను ఎదుర్కుంటానని తెలిపారు..మే 13న జరగబోయేది ఎన్నికల కురుక్షేత్రం అని అభివర్ణించారు. పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధం అని… పేదలంతా ఒక వైపు, పెత్తందార్లు మరో వైపు అని పేర్కొన్నారు. కూటమి పేరుతో కుట్రలు చేస్తున్న మోసగాళ్లను నమ్మవద్దని సీఎం జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.