APCINEMATELANGANA

సుమ-నాగ్ హోస్ట్‌గా BigBoss’ధమాకా’ ప్రోమో.. ఆల్ సీజన్ కంటెస్టెంట్స్‌తో స్టేజ్

బిగ్ బ్రదర్ పేరుతో అమెరికాలో విశేష ఆదరణ దక్కించుకున్న రియాలిటీ షో.. ఇండియాలో ‘బిగ్ బాస్’గా ఆకట్టుకుంటోంది. ఆకట్టుకోవడమే కాదు.. ఊహించని రేంజ్ లో విశేషమైన ప్రేక్షకాదరణ పొందుతుందనే చెప్పాలి.

తెలుగులో ఇప్పటికే ఆరు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో.. త్వరలోనే ఏడో సీజన్ కోసం రెడీ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ మరో అదిరిపోయే ప్రోమోను రిలీజ్ చేశారు. వివరాళ్లోకి వెళితే..

ఊహకందని మలువులు, ఎన్నో ట్విస్టులు, గొడవలు, కొట్లాటలు, టాస్క్ లు, ఫన్నీ గేమ్ షోలు, డ్యాన్స్ లు.. ఇలా ఎన్నో అంశాలతో అభిమానులను ఉత్కంఠత రేపే బుల్లితెర రియాలియా షో ‘బిగ్ బాస్’. సీజన్.. సీజన్ కు రెట్టింపు వినోదాన్ని పంచుతూ ఆడియెన్స్ ను ఫుల్ ఎంటర్ టైన్మెంట్ చేస్తుంది. తెలుగులో ఇప్పటికే ఆరు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో.. త్వరలోనే ఏడో సీజన్ కోసం రెడీ అవుతోంది.

భారీగా ప్లాన్.. :అయితే ఏడో సీజన్ కోసం మేకర్స్ భారీగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సీజన్ ప్రసారం టైమ్ దగ్గరపడే కొద్ది.. రోజుకో ఇంట్రెస్టింగ్ వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే సాధారణంగా.. ఒక్కో సీజన్ చూస్తుంటేనే ఎంతో ఉత్కంఠకు గురౌతుంటారు ఆడియెన్స్. మరి అలాంటిది ఆరు సీజన్ల కంటెస్టెంట్ లు అందరూ ఒకే చోటకు చేరి సందడి చేస్తే.. ఎలా ఉంటుంది.. ఆ ఊహే ఎంతో బాగుంది కదూ. ఇప్పుడా ఊహనే నిజం చేస్తూ ఓ స్పెషల్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు మేకర్స్. ‘షైనింగ్ స్టార్స్’ పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్విహించబోతున్నారు.

ప్రోమో రిలీజ్.. :’బిగ్ బాస్’ సీజన్ 7 దగ్గర పడే కొద్ది ఆడియెన్స్ లో స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేందుకు ప్రమోషన్స్ ను కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నారు. అదే సమయంలో డిఫరెంట్ గా కూడా ఉండేలా చూసుకుంటున్నారు. ఈసారి ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఉండేలా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఓ వినూత్న కార్యక్రమానికి తెర లేపారు మేకర్స్. ఆల్ సీజన్స్ కంటెస్టెంట్ లను ఒకే చోటకు చేర్చబోతున్నట్లు తెలుపుతూ ఓ స్పెషల్ ప్రోమోను రిలీజ్ చేశారు.

 

ప్రోమో సాగిందిలా..:ఈ కార్యక్రమానికి అన్ని కంటెస్టెంట్ లతో పాటు హోస్ట్ నాగార్జున కూడా హాజరై సందడి చేశారు. అయితే ఈ స్పెషల్ ప్రోగ్రామ్ కు సుమ హోస్ట్ గా వ్యవహరించున్నారు. ఈ ప్రోమో ఎంతో సందడి సందడిగా సాగింది. ఫన్నీ గేమ్స్ షో, ఆటపాటలతో సాగింది. ఇందులో సుమ.. ‘ఒకటి కాదు రెండు కాదు సిక్స్ సీజన్స్ ఆఫ్ బిగ్ బాస్ స్టార్స్ అందరూ ఒకే వేదికపై ఉంటే ఎలా ఉంటుంది ఇప్పుడదే జరగబోతుంది’ అంటూ హుషారెత్తించింది.

 

‘నడిసొస్తే మాస్ టోటల్ గా మీ అందరి బాస్’ అంటూ నాగార్జున స్టైల్ గా నడిచిరావడం హైలైట్ గా ఉంది. ఇక ‘ప్రోమోలో.. కుడి ఎడమైతే అని ప్రోమోలో చెప్పారు.. అదేంటో కాస్త చెప్పండి’ అంటూ సుమ అడగగా.. దానికి సమాధానం చెప్పేశారు నాగ్. కొత్త రూల్స్, కొత్త ఛాలెంజెస్, కొత్త గేమ్స్ ఉంటాయి అంటూ దాన్ని చిక్కుముడి విప్పేశారు. అంటే దీని బట్టి ఈ సారి మరింత కొత్తగా సీజన్ 7 ఉండబోతుందని తెలుస్తోంది.

గెస్ట్ లుగా.. :ఇక ఈ షోకు గెస్ట్ లుగా.. రీసెంట్ గా విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన యూత్ ఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘బేబీ’ మూవీ హీరోహీరోయిన్లు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కూడా హాజరై సందడి చేశారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి ‘భోళాశంకర్’ దర్శకుడు మెహర్ రమేశ్ తో పాటు సీనియర్ నటుడు బ్రహ్మాజీ కూడా గెస్ట్ లుగా విచ్చేసి సందడి సందడి చేశారు. ఫన్నీ ఫన్నీగా షోను ముందుకు నడిపించారు.