AP

టీడీపీ కూటమి మేనిఫెస్టో పై కీలక నిర్ణయం – వైసీపీకి పోటీగా..!!

ఏపీలో ఎన్నికల రాజకీయం హోరా హోరీగా మారుతోంది. ప్రధాన పార్టీలు విజయం పైన ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అధికారంలోకి వస్తే అమలు చేసే నిర్ణయాల గురించి ప్రచారంలో వివరిస్తున్నారు. ఇక, మూడు పార్టీల ఎన్డీఏ కూటమి..వైసీపీ తమ మేనిఫెస్టోల రూపకల్పన పైన ఫోకస్ చేసాయి. టీడీపీ ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో సంక్షేమ పథకాలను ప్రకటించింది. ఇటు జగన్ ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఈ సమయంలోనే టీడీపీ కూటమి మేనిఫెస్టో పైన కీలక నిర్ణయం తీసుకుంది.

 

టీడీపీ మహిళా ఓట్ బ్యాంక్ లక్ష్యంగా సూపర్ సిక్స్ పేరుతో సంక్షేమ పథకాలను ప్రకటించింది. ఇప్పుడు టీడీపీకి బీజేపీ, జనసేన కలవటంతో మూడు పార్టీల ఎన్నికల హామీలను కలగలిపి ప్రజా మేనిఫెస్టోగా ప్రకటించేందుకు సిద్దమవుతున్నారు. మూడు పార్టీల నుంచి నియమితులైన నేతలు సమన్వయ కమిటీగా మేనిఫెస్టో హామీల పైన కసరత్తు చేస్తున్నారు. తాజాగా ప్రజల నుంచి మేనిఫెస్టోలో చేర్చే అంశాల పై సూచనలు, సలహాలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇందు కోసం టోల్ ఫ్రీ నెంబర్ ప్రకటించారు. 8341130393 నెంబర్ కు సాధారణ ప్రజలు తమ సూచనలు, సలహాలను వాయిస్ మెసేజ్, సందేశం, పీడీఎఫ్ రూపంలో పంపవచ్చని పార్టీల నేతలు వెల్లడించారు.

 

మరో వైపు సీఎం జగన్ తన బస్సు యాత్ర సమయంలో వివిధ వర్గాల ప్రజలతో మమేకం అవుతున్నారు. ప్రజాభిప్రాయాలను తెలుసుకుంటూ మేనిఫెస్టోలో చేర్చందుకు ఆరా తీస్తున్నారు. ప్రజల నుంచి లిఖిత పూర్వకంగా అభిప్రాయాలు చెప్పందేకు అవకాశం కల్పిస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేసామని చెబుతున్న జగన్..తాము చేసేదే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటన చేస్తామని స్పష్టం చేసారు. చంద్రబాబు ఓట్ల కోసం హామీలిస్తారని..అమలు చేయరని ప్రతీ సభలోనూ విమర్శిస్తున్నారు. మేనిఫెస్టోలో జగన్ ఇచ్చే హామీల పైన ఆసక్తి నెలకొంది. రెండు వైపులా మేనిఫెస్టో పైన కసరత్తు జరుగుతోంది. దీంతో…హోరా హోరీ ఎన్నికల పోరులో మేనిఫెస్టో గేమ్ ఛేంజర్ గా నిలవనుంది.