జగన్ 2.ఓ మొదలైందా? మొన్న కాంగ్రెస్ నుండి శైలజా నాథ్ వైసీపీలో చేరారు. తాజాగా మరో టీడీపీ ఎమ్మెల్యే తమ్ముడు.. వైసీపీలో చేరనున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అది కూడ ఈ నేత చేరికతో మాజీ మంత్రి రోజాకు చెక్ పెట్టేందుకు వైసీపీకి చెందిన మరో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. అలాగే కూటమిలోని టీడీపీకి చెందిన ఎమ్మెల్యే తమ్ముడికి సముచిత స్థానం కల్పిస్తే, ఒక దెబ్బకు రెండు పిట్టలు అనే తరహాలో పెద్దిరెడ్డి ప్లాన్ వేశారట. ఇంతకు ఆ ప్లాన్ ఏంటో తెలుసుకుందాం.
ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఏరోజు ఏ నేత ఎక్కడ ఉంటారో తెలియని పరిస్థితులు ఉన్నాయని టాక్. మొన్నటికి మొన్న వైసీపీకి వీర విధేయుడు విజయసాయి రెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పి షాకిచ్చారు. అదీకాక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళతో భేటీ కావడం బిగ్ షాక్ అని చెప్పవచ్చు. ఆ సంధర్భంగా జగన్ లక్ష్యంగా షర్మిళ సంచలన కామెంట్స్ చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ నుండి శైలజానాథ్ వైసీపీలో చేరారు. స్వయంగా జగన్ పార్టీ కండువా కప్పి సాదర స్వాగతం పలికారు. ఇది ఇలా ఉంటే కూటమి ప్రభుత్వం రాగానే, వైసీపీకి చెందిన కీలక నేతలు ఒక్కొక్కరుగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలలో చేరారు. అయితే ఎలాగైనా పార్టీకి పూర్వ వైభవం తీసుకు రావాలని జగన్ పెద్ద ప్లాన్ వేసినట్లేనని తాజా పరిస్థితులను బట్టి చెప్పవచ్చు.
అయితే ఇటీవల చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లక్ష్యంగా కూటమి విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. భూ ఆక్రమణలకు పెద్దిరెడ్డి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ సంచలన కామెంట్స్ చేయడమే కాక, విచారణకు ఆదేశించే పరిస్థితులు ఉన్నాయి. ఈ సమయంలోనే కూటమికి బిగ్ షాక్ ఇచ్చేందుకు పెద్దిరెడ్డి సిద్దమయ్యారని ప్రచారం సాగుతోంది. అది కూడ మాజీ మంత్రి రోజాకు కూడ ఎదురుదెబ్బ కొట్టాలన్న లక్ష్యంతో పెద్దిరెడ్డి పెద్ద ప్లాన్ వేసినట్లు ప్రచారంలో ఉంది. నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ సోదరుడు గాలి జగదీష్ వైసీపీ చేరనున్నట్లు వదంతులు వ్యాపిస్తున్నాయి. అది కూడ రెండు రోజుల్లో చేరిక ఖాయమని చిత్తూరు జిల్లాలో ప్రచారం ఊపందుకుంది. అధికార పార్టీ ఎమ్మెల్యే సోదరుడిని పార్టీలోకి తీసుకుంటే గట్టి దెబ్బ తగిలినట్లేనని, అందుకే పెద్దిరెడ్డి డైరెక్షన్ లో ఈ చేరిక ఉంటుందని టాక్.
అంతేకాకుండా నగరి మాజీ ఎమ్మేల్యే, మాజీ మంత్రి రోజా కు కూడ చెక్ పెట్టేందుకు పెద్దిరెడ్డి సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఇలా రోజాకు చెక్ పెట్టవచ్చు.. అలా కూటమికి దెబ్బ కొట్టవచ్చనే పెద్దిరెడ్డి ఇలా ప్లాన్ చేసినట్లు ప్రచారం ఊపందుకుంది. వాస్తవంగా ఈ చేరిక జరిగితే, రోజా ఎలా స్పందిస్తారోనని కూడ రాజకీయ విశ్లేషకులు చర్చలు సాగిస్తున్నారు. మొత్తం మీద గాలి జగదీష్ చేరిక ఖాయమైతే కానీ, రాజకీయ ముఖచిత్రం అసలు రూపం బయటపడే అవకాశాలు ఉన్నట్లు చెప్పవచ్చు. ఈ ప్రచారం వాస్తవమా? లేక పుకార్లేనా అన్నది మరో రెండు రోజుల్లో తేలే అవకాశం ఉంది.