APTELANGANA

కామయ్య బంధను కబ్జాదారుల చెర నుంచి కాపాడాలి

కామయ్య బంధను కబ్జాదారుల చెర నుంచి కాపాడాలి

పార్వతీపురం మన్యం జిల్లా మున్సిపాలిటీ పరిధిలో సర్వే నంబర్ 337లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి కామయ్య బంధను కబ్జాదారుల చెర నుంచి కాపాడాలని సిపిఐ (ఎం.ఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి.సంగం డిమాండ్ చేశారు. వివిధ వార్తా పత్రికల్లో కామయ్య బందపై కథనాలు వస్తున్న నేపథ్యంలో గురువారం ఆయన మాట్లాడారు. సుమారు 13.57 ఎకరాల విస్తీర్ణం కలిగిన కామయ్య బందలో ఒక ఎకరా భూమిని కబ్జాదారులు ఆక్రమించి అమ్మకాలు చేస్తున్న ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం అందిందని తెలిపారు. దీనికి సంబంధించి వివిధ పత్రికలో కథనాలు కూడా వెలువడ్డాయని అన్నారు. న్యాయస్థానం ఈ భూమిని 2007లో ప్రభుత్వ భూమిగా గుర్తించి తీర్పు కూడా వెలువరించిందని, అయినా ఆక్రమణదారులు రెచ్చిపోతు అమ్మకాలు చేస్తున్నారని మండిపడ్డారు. కావున కామయ్య బంధ కబ్జాదారుల చెర నుంచి కాపాడి పేదలకు గాని ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు గాని వినియోగించాలని కోరారు. పాలకొండ మండల కార్యదర్శి బి.వెంకటరమణ, అజ్జరాపు దాము, తదితరులు పాల్గొన్నారు.