AP

ఉప్పాడ తీరంలో రాకాసి అలలు..! జలమయంగా మాయపట్నం..

ఉప్పాడ తీరంలో భారీగా అలలు ఎగిసిపడుతున్నాయి. సముద్రం ఉప్పొంగడంతో కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం మాయపట్నం గ్రామం జలమయంగా మారింది. సముద్రపు నీరు గ్రామంలోకి చొచ్చుకు రావడంతో 20 ఇళ్లు కూలిపోయాయని గ్రామస్తులు తెలిపారు. సముద్రపు నీరు దాదాపు 70 ఇళ్లలోకి చేరిందని, బయట అడుగుపెట్టే వీలులేకుండా పోయిందని వాపోయారు. తీర ప్రాంతంలో రక్షణ గోడలు, జియో ట్యూబ్ ధ్వంసం కావడం వల్లే గ్రామంలోకి సముద్రపు నీరు చేరుకుందని అధికారులు చెబుతున్నారు. మాయపట్నం గ్రామానికి చేరుకున్న అధికారులు సముద్రపు నీటిని వెనక్కి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు.