AP

కదిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నూతన ప్రిన్సిపల్‌గా పి. భాస్కర్ బాధ్యతల స్వీకారం

ప్రభుత్వ పాలిటెక్నిక్ కదిరి కళాశాల ప్రిన్సిపల్ గా పి భాస్కర్ గారు పదవి చేపట్టారు
స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కదిరి నూతన ప్రిన్సిపల్ గా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగాధిపతి అయిన పి భాస్కర్ గారు ఈరోజు పదవి బాధ్యతలు చేపట్టారు. జనవరి 31వ తారీఖున కె రమా ప్రిన్సిపల్ గారు పదవీ విరమణ పొంది నూతన ప్రిన్సిపల్ గా పి భాస్కర్ గారు ఈరోజు నుండి పదవి బాధ్యతలు స్వీకరించారు. దీనికి కళాశాల సిబ్బంది అందరూ ఘన స్వాగతం పలికి అభినందించారు.