AP

ఢిల్లీకి అమరావతి(Amaravathi) రైతుల పోరు

అమరావతి(Amaravathi) రైతుల పోరు ఢిల్లీకిఅమరావతి(Amaravathi) రైతుల పోరుచేరింది. కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిపించడానికి రైతులు సిద్ధం అయ్యారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న వేళ ధర్నాకు దిగారు. రాజధానికి(Capital) భూములు త్యాగం చేసి రోడ్డున పడ్డ రైతులు వివిధ రూపాల్లో మూడేళ్లుగా పోరాడుతున్నారు. ప్రజా క్షేత్రంలో పోరాడుతూ న్యాయస్థానాలను ఆశ్రయించారు. సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల(3 Capital ) అంశం రైతులను నట్టేట ముంచింది. మూడేళ్లుగా నిర్విరామంగా రైతులు ఉద్యమిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం తీరును నిరసిస్తున్నారు. మహా పాదయాత్రగా న్యాయస్థానం(హైకోర్టు) నుంచి దేవస్థానం( తిరుమల) వరకు వెళ్లారు. రెండో విడత అమరావతి(Amaravathi) టూ అరసవెల్లి మహాపాదయాత్రకు దిగారు. మార్గమధ్యంలోనే వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో న్యాయస్థానంను ఆశ్రయించారు.

కొన్ని ఆంక్షల నడుమ పాదయాత్రకు అనుమతించిన విషయం విదితమే. ఇదే సమయంలో సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసింది. దానిపై విచారణ కొనసాగుతోంది. ఇదే సమయంలో ఏపీకి అమరావతి(Amaravathi)నే ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగారు. ఢిల్లీకి వెళ్లిన అమరావతి ఢిల్లీకి వెళ్లిన అమరావతి ఉద్యమానికి టీడీపీ, కాంగ్రెస్, జనసేన, సీపీఐ నేతలు మద్దతు పలికారు. టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, జనసేన నేత హరిప్రసాద్, ఏఐసీసీ కార్యదర్శి జేడీ శీలం, ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితరులు జంతర్ మంతర్ కు వెళ్లి రైతులకు సంఘీభావాన్ని ప్రకటించారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రేపు, ఎల్లుండి వివిధ పార్టీల నేతలను అమరావతి రైతులు కలవనున్నారు. సోమవారం రామ్ లీలా మైదానంలో జరిగే భారతీయ కిసాన్ సంఘ్ ర్యాలీలో అమరావతి రైతులు పాల్గొననున్నారు.

అమరావతి రైతు ఉద్యమాన్ని భారతీయ కిసాన్ సంఘ్ ప్రత్యేక అజెండాగా చేర్చింది. గతంలోనూ వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా కిసాన్ సంఘ్ చేపట్టిన ఉద్యమానికి అమరావతి రైతులు మద్ధతు పలికారు. ఇప్పుడు కిసాన్ సంఘ్ మద్ధతు అమరావతి రైతులకు లభించింది. సుప్రీం కోర్టుకు జగన్మోహన్ రెడ్డి అమరావతి ఏకైకా రాజధానిగా ఉండాలని ఏపీలోని రాజకీయ పార్టీలన్నీ కోరుకుంటున్నాయి. ఒక్క వైసీపీ మినహా మిగిలిన పార్టీలు రైతులకు సంఘీభావం ప్రకటించినప్పటికీ సుప్రీం కోర్టుకు జగన్మోహన్ రెడ్డి సర్కార్ వెళ్లింది. మూడు రాజధానుల దిశగా ఏపీ సర్కార్ అడుగులు వేస్తోంది. అయితే, రైతులు ఇచ్చిన భూములు, సీఆర్డీఏ వాళ్లతో చేసుకున్న ఒప్పందాల అంశం తేలాల్సి ఉంది. అమరావతిని ఏకైక రాజధానిగా నిర్థారిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పున సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెళ్లింది. దానిపై ఇటీవల విచారణ చేసిన సుప్రీం కోర్టు బెంచ్ త్వరలోనే తుది తీర్పు ఇవ్వనుంది. దానిపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా ఆ తీర్పుకు అనుగుణంగా నడవడానికి సన్నాహాలు చేసుకుంటుంది.