Editor

AP

బండ్లపల్లిలో రంగరంగ వైభవంగా నరసింహస్వామి పంజా మరియు దోసంగల ఉత్సవం

శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం బండ్లపల్లి గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కదిరి పున్నమి (హోలీ) పండుగ వేడుకలు అత్యంత వేడుకగా జరిగాయి. ఈ పవిత్ర దినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన పంజా మరియు దోసంగల ఉత్సవం భక్తుల కోలాహలం మధ్య రంగరంగ వైభవంగా సాగింది. గ్రామస్తులు, చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ప్రత్యేక పూజలు, సాంప్రదాయ కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హోలీ…

AP

దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం: ధర్మవరంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం

📌ధర్మవరం ధర్మవరం నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ ఇంచార్జ్ గౌరవనీయులు పరిటాల శ్రీరామ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగుల ఇంద్రధనుష్ వరాలలో ఒకటైన దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రకటించిన సందర్భంగా రాష్ట్ర విభిన్న ప్రతిబావంతుల మరియు వయో వృద్ధుల కార్పొరేషన్ చైర్మన్ గడుపూటి నారాయణ స్వామి గారు,తెలుగు దేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు నాగూర్ ఉమర్ (స్టాలిన్) మరియు దివ్యాంగుల తో కలిసి ధర్మవరం…

AP

పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్

శ్రీ సత్యసాయి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మరియు మాజీ మంత్రివర్యులు శ్రీమతి ఉషాశ్రీ చరణ్ గారు నేడు నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో జరిగిన శుభ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక నాయకులు, కార్యకర్తల గృహాలకు వెళ్లి నూతన దంపతులను మరియు కుటుంబ సభ్యులను ఆశీర్వదించి, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె స్థానిక ప్రజలతో ముచ్చటించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.…

AP

కదిరి లక్ష్మీనరసింహ స్వామి రథోత్సవానికి పటిష్ట భద్రత: స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్

శ్రీ సత్య సాయి జిల్లా… కదిరిలో ఈనెల 10న జరుగునున్న లక్ష్మీనరసింహస్వామి రథోత్సవ భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ గారు… రథోత్సవ సందర్భంగా పటిష్టమైన భద్రత… భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు సౌకర్యాలు సిద్ధం చేసుకోండి… జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్ ఐపీఎస్ గారు… కదిరి పట్టణంలో జరగనున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈనెల 10న నిర్వహించనున్న రథోత్సవానికి సంబంధించి భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.…

AP

జగన్మోహన్ రెడ్డితో పుట్లూరు ఎంపీపీ రాఘవేంద్రారెడ్డి భేటీ: శింగనమల నియోజకవర్గ రాజకీయాలపై చర్చ

వైసిపి అధినేత YS Jagan Mohan Reddy గారిని తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన పుట్లూరు మండల అధ్యక్షులు Raghavendra Bhumi Reddy అన్నగారు గారు తాడేపల్లి:- క్యాంపు కార్యాలయం నందు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైసిపి అధినేత శ్రీవైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసిన ఎంపిపి భూమిరెడ్డి రాఘవేంద్రారెడ్డి గారు దాదాపు అరగంట పాటు మాట్లాడి, పుట్లూరు మండలం మరియు శింగనమల నియోజకవర్గ ప్రస్తుత రాజకీయ పరిస్థితులను అడిగి…

AP

కదిరి బస్టాండ్‌లో ‘లేడీ గ్యాంగ్’ అరెస్ట్: ముగ్గురు మహిళా దొంగల నుంచి ₹6.40 లక్షల సొత్తు స్వాధీనం

కదిరి టౌన్ పోలీసు స్టేషన్… కదిరి APSRTC బస్ స్టాండ్ వద్ద దొంగతనాలు చేసిన ముగ్గురు మహిళా దొంగలు అరెస్టు, వారి వద్ద నుండి సుమారు  సుమారు 5,65,000/- విలువగల బంగారు ఆభరణాలు మరియు 75,000/- నగదు స్వాధీనము… కదిరి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని APSRTC బస్ స్టాండ్ వద్ద గత 5 నెలల కాలములో   వరుసగా జరుగుతున్న పర్సు మరియు బంగారు ఆభరణాల దొంగతనాలపై కదిరి పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కదిరి DSP,…

AP

విగ్రహాలను ద్వంశం చేసిన కేసులో ముద్దాయి అరెస్టు…

కదిరి టౌన్, కుమ్మరోల్ల పల్లి గ్రామము పురాతన శ్రీరాములు గుడి వద్ద సిమెంట్ తో తయారు చేయబడిన హనుమంతుడు, మరియు గరుత్మంతుడు స్వామి వారి విగ్రహాలను ద్వంశం చేసిన వ్యక్తి అయిన కుంచపు వెంకటేష్, వయస్సు: 34 సంవత్సరాలు, తండ్రి: అంజినేయులు, మూర్తి పల్లి గ్రామము కదిరి అను వ్యక్తిని అరెస్టు చేయడం జరిగింది. విచారణ చేయగా సదరు కుంచపు వెంకటేష్ గతములో సదరు గుడి గోపురము, మరియు రామాలయము ఆర్చ్ లను కట్టుటకు గుడి ధర్మకర్తలు…

National

అస్సాంలో కూలిన యుద్ధ విమానం.. భారీ పేలుడు శబ్దం, స్థానికులు బెంబేలు..

అస్సాంలోని కర్బీ అంగ్లాంగ్ జిల్లా పరిధిలోని మారుమూల కొండ ప్రాంతంలో గురువారం సాయంత్రం భారత వాయుసేనకు చెందిన సుఖోయ్-30 యుద్ధ విమానం కూలింది. జోర్హాట్ ఎయిర్‌ బేస్ నుండి బయలు దేరిన కొద్దిసేపటికే యుద్ధ విమానం రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. చొకిహోలా పరిధిలోని కొండ ప్రాంతంలో ఈ ప్రమాదం జరగవచ్చని అధికారులు భావిస్తున్నారు. అందులోవున్న ఇద్దరు పైలట్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.   గురువారం సాయంత్రం అసొంలోని జోర్హాట్‌లోని వైమానిక బేస్ నుండి బయలు దేరింది సుఖోయ్-30…

TELANGANA

తెలంగాణలో భూసేకరణకు ప్రభుత్వం 5000 కోట్లు విడుదల..

రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణాలకు అవసరమైన భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం 5,000 కోట్ల నిధులు విడుదల చేయనున్నదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. జూన్ 2 వరకు భూసేకరణ పూర్తి చేయాలని, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బుధవారం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, వివేక్ వెంకటస్వామి, దామోదర్ రాజనర్సింహలతో కలిసి సచివాలయంలో నీటిపారుదల శాఖ ఇంజినీర్లతో ఉన్నత స్థాయిలో సమీక్షా సమావేశం నిర్వహించారు.   సింగూర్…

TELANGANA

మూసీ పేరిట విధ్వంసం..! ప్రభుత్వానికి కేటీఆర్ వార్నింగ్..

కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ పేరిట హైదరాబాద్ లో సృష్టిస్తున్న విధ్వంసాన్ని అసెంబ్లీ సమావేశాల్లో ఎండగడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి చేస్తున్నది ‘మూసీ బ్యూటిఫికేషన్’ కాదని.. అది ‘లూటిఫికేషన్’ అని దుయ్యబట్టారు. నాగోల్ లో ఉన్న ఎస్టీపీని గురువారం పార్టీ నేతలతో కలిసి కేటీఆర్ పరిశీలించారు. తర్వాత నాగోల్ బ్రిడ్జి వద్ద గత ప్రభుత్వం అభివృద్ధి చేసిన మూసి మోడల్ ని పరిశీలించి అక్కడ ఉన్న బాధితులతో మాట్లాడారు. రూ.16 వేల కోట్లతో…