ఆపరేషన్ సిందూర్… జైషే చీఫ్ మసూద్ అజార్ సోదరి, బావ సహా 10 మంది కుటుంబ సభ్యుల మృతి..
పాకిస్థాన్ భూభాగం మరియు పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత భద్రతా దళాలు ఈ తెల్లవారుజామున దాడులు చేపట్టాయి. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో చేపట్టిన ఈ చర్యల్లో జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజార్ కుటుంబ సభ్యులు మరణించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. తెల్లవారుజామున 1.05 గంటల సమయంలో, పాకిస్థాన్ మరియు పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళాలు క్షిపణులతో విరుచుకుపడ్డాయి. జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి…

