Editor

AP

పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు

“పేదల సేవలో” కార్యక్రమంలో భాగంగా ఈరోజు కదిరి పట్టణం మున్సిపల్ 10వ వార్డు నందు “ఎన్టీఆర్ భరోసా” పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారూ. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి నేరుగా చేరాలన్న స్పష్టమైన లక్ష్యంతో, లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పెన్షన్లు అందజేశారు. పేదల జీవన భద్రతను బలోపేతం చేయడం, వారికి సామాజిక గౌరవం కల్పించడమే ప్రభుత్వ ప్రధాన బాధ్యతగా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు స్పష్టం…

AP

కదిరి పుణ్యక్షేత్రంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాల అంకురార్పణ: సరికొత్త డిజిటల్ సేవలను ప్రారంభించిన ఎమ్మెల్యే కందికుంట దంపతులు

*అంకురార్పణ పూజ కార్యక్రమంలో పాల్గొనుటకు ఆలయ ప్రధాన అర్చకులను స్వాగతం పలికిన కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి దంపతులు* కదిరి శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన Ai ఆన్లైన్ టికెట్ల దర్శనం,ఈ హుండీ, కేసఖండన, ఆటో మేటిక్ టికెట్ వెండింగ్ మిషన్స్ సేవలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు ఆయన సతీమణి శ్రీమతి కందికుంట యశోద…

CINEMA

దళపతి విజయ్‌కు భార్య సంగీత షాక్: కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు.. 26 ఏళ్ల బంధానికి ముగింపు?

తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా, ‘తమిళ వెట్రి కళగం’ (TVK) పార్టీ అధినేతగా వెలుగొందుతున్న విజయ్ వ్యక్తిగత జీవితంలో పెను భూకంపం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా వీరిద్దరూ విడిపోతున్నారంటూ వస్తున్న వార్తలను నిజం చేస్తూ, విజయ్ భార్య సంగీత చెంగల్‌పట్టు జిల్లా కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. 1999లో వివాహం చేసుకున్న ఈ జంట, సుమారు 26 ఏళ్ల సుదీర్ఘ వైవాహిక బంధం తర్వాత చట్టబద్ధంగా విడిపోవాలని నిర్ణయించుకోవడం అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.…

TELANGANA

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాజీ మావోయిస్ట్ నేతల భేటీ: ‘తుపాకీ సిద్ధాంతం ఇక చెల్లదు’.. ప్రభుత్వ సరెండర్ పాలసీపై ప్రశంసలు!

ఇటీవల జనజీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్ట్ పార్టీ మాజీ అగ్రనేతలు తిప్పిరి తిరుపతి (దేవ్‌జీ), నూనె నరసింహారెడ్డి తదితరులు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. దాదాపు గంటన్నరకు పైగా సాగిన ఈ భేటీలో ప్రభుత్వ సహాయం, లొంగిపోయిన వారికి పునరావాసం మరియు ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ సరెండర్ పాలసీ బాగుందని దేవ్‌జీ ప్రశంసించడమే కాకుండా, ఆధునిక ప్రపంచంలో తుపాకీ సిద్ధాంతం కంటే ప్రజాస్వామ్య మార్గమే శరణ్యమని తాము నమ్ముతున్నట్లు…

AP

పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయంలో కలకలం: లోపలికి చొరబడి కాన్వాయ్ వాహనాలను ధ్వంసం చేసిన వ్యక్తి!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారి మంగళగిరి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన నీలాద్రి అనే వ్యక్తి ఆటోలో నేరుగా కార్యాలయంలోకి చొరబడి వీరంగం సృష్టించాడు. సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగి, అక్కడే ఉన్న కర్రతో పవన్ కల్యాణ్ కాన్వాయ్‌లోని రెండు వాహనాల అద్దాలను పగులగొట్టి ధ్వంసం చేశాడు. వెంటనే అప్రమత్తమైన జనసేన కార్యాలయ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల ప్రాథమిక…

TELANGANA

ఏపీ అసెంబ్లీలో సందడి: స్పీకర్ అయ్యన్నపాత్రుడిని కలిసి కుమారుడి పెళ్లికి ఆహ్వానించిన భట్టి విక్రమార్క!

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. అమరావతిలోని అసెంబ్లీ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో భట్టితో పాటు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. మార్చి 5వ తేదీన హైదరాబాద్‌లో జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు రావాల్సిందిగా స్పీకర్‌కు ఆహ్వాన పత్రికను అందించి, సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల…

AP

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసిన ఎమ్మెల్యే శ్రావణి మరియు ADCC బ్యాంక్ చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి

*ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసిన ఎమ్మెల్యే, శ్రావణి గారు, ADCC బ్యాంక్ చైర్మెన్ ముంటిమడుగు కేశవరెడ్డి గారు,* ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన *ఎమ్మెల్యేలు బండారు శ్రావణి, MS రాజు గారితో పాటు కలసిన ఉమ్మడి అనంతపురం జిల్లా ADCC బ్యాంక్ చైర్మెన్ ముంటిమడుగు కేశవరెడ్డి గారు* నియోజకవర్గం లోని పలు అంశాలపై చర్చించారు.

TELANGANA

కేటీఆర్, హరీశ్‌రావువి అన్నీ అబద్ధాలే: కాళేశ్వరం వైఫల్యాలపై మంత్రి పొంగులేటి ధ్వజం

తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా వాస్తవ దూరమని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసినా, ఆశించిన ఫలితం మాత్రం శూన్యమని విమర్శించారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌ రావు ప్రజలను తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా అబద్ధాలు మాట్లాడుతున్నారని, వారి విమర్శలు కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని ఆయన ఆక్షేపించారు. గత పాలకులు దాదాపు రూ.…

AP

తమ్ముడూ.. నువ్వు లేవంటే నమ్మలేకపోతున్నా: నూతలపాటి నాగభూషణం మృతిపై నారా లోకేశ్ భావోద్వేగం

తెలుగుదేశం పార్టీ యువజన విభాగమైన ‘తెలుగు యువత’ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూతలపాటి నాగభూషణం అకాల మరణం పార్టీలో తీవ్ర విషాదాన్ని నింపింది. గుండెపోటుతో ఆయన హఠాన్మరణం చెందడం పట్ల రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాగభూషణంతో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ లోకేశ్ సామాజిక మాధ్యమాల్లో అత్యంత భావోద్వేగపూరితమైన సందేశాన్ని పోస్ట్ చేశారు. “తమ్ముడూ.. నువ్వు లేవని, ఇక రావని అంటే నమ్మడం కష్టంగా…

CINEMA

ఒకటైన ‘విరోష్’: నా భర్త విజయ్ దేవరకొండ అంటూ రష్మిక భావోద్వేగ పోస్ట్!

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ బంధంపై గత కొన్నేళ్లుగా సాగుతున్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా ఈ జంట పెళ్లి పీటలెక్కినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా విజయ్‌ను ‘నా భర్త’ అని పరిచయం చేస్తూ అత్యంత భావోద్వేగపూరితమైన పోస్ట్‌ను షేర్ చేశారు. “హాయ్ మై లవ్స్.. ఇప్పుడు మీకు నా భర్తను పరిచయం చేస్తున్నాను.. మిస్టర్ విజయ్ దేవరకొండ!” అంటూ…