Editor

AP

బొండా ఉమకు షోకాజ్ నోటీస్.. చంద్రబాబుపై అంబటి సంచలన కామెంట్స్..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు నేతల ఐక్యత, వారి భేటీలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. అయితే ఇటీవల జరిగిన ఒక సంతాప సభ ఇప్పుడు తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య కొత్త రాజకీయ మంటలు రాజేసింది. ముద్రగడ కుటుంబంలో జరిగిన సంతాప సభకు హాజరై తన పక్కన కూర్చున్నారనే కారణంతో టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమకు నోటీసులు ఇవ్వడాన్ని మాజీ మంత్రి, వైసిపి నేత అంబటి రాంబాబు తీవ్రంగా తప్పుపట్టారు. కాపులు ఒకటైతే చంద్రబాబుకు భయం.. కాపులందరూ…

TELANGANA

హైకోర్టు సంచలన నిర్ణయం.. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ తొలగింపునకు ఆదేశాలు..

హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ వ్యవహారశైలిపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వరుసగా కోర్టు ధిక్కరణ పిటిషన్లు నమోదవుతున్న నేపథ్యంలో ఆయన్ను కమిషనర్‌ పదవి నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆయన స్థానంలో ఐజీ స్థాయి అధికారిని నియమించాలని చీఫ్‌ సెక్రటరీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం సహించబోమని ధర్మాసనం స్పష్టం చేసింది.   మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా లోతుకుంట పరిధిలోని సర్వే నంబర్‌ 1, 2లలో…

National

త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ..! రూ.10, రూ.20 నోట్ల ట్రయల్స్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్..

దేశంలో ప్లాస్టిక్ లేదా పాలిమర్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రూ. 10, రూ. 20 విలువ కలిగిన ప్లాస్టిక్ పాలిమర్ నోట్లను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్‌సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.   ఈ ప్రయోగాల్లో భాగంగా రూ. 10, రూ.…

AP

సీఐ నాగరాజు కేసులో మలుపు.. కస్టడీపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

కృష్ణలంక యువకుడు గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజు కస్టడీ విచారణపై సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పును వెలువరించింది. నిందితుడిని రాజమండ్రి జైలులోనే విచారించాలంటూ గతంలో ట్రయల్ కోర్టు, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సర్వోన్నత న్యాయస్థానం పక్కన పెట్టింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, దర్యాప్తునకు అనుకూలంగా ఈ ఆదేశాలు జారీ చేసింది.   విచారణ కోసం సీఐ నాగరాజును విజయవాడలోని దర్యాప్తు కేంద్రానికి గానీ,…

TELANGANA

ఆరో తరగతి బాలికపై.. ఇద్దరు అన్నలు, మేనమామ అఘాయిత్యం..!

ఏ హానీ జరగకుండా చూసుకోవాల్సిన వారే ఆ చిన్నారి పాలిట రాక్షసులయ్యారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వరుసకు అన్నలయ్యే ఇద్దరు బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. అది చూసి మందలించాల్సిన మేనమామ కూడా అత్యాచారం జరిపాడు. స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించిన ఈ సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి.   6వ తరగతి చిన్నారి.. కీసర ప్రాంతానికి చెందిన బాధిత చిన్నారి తండ్రికి ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి…

TELANGANA

రాజీనామాతో సరిపెట్టేస్తారా.. నీట్ లీకేజీ బాధ్యులపై చర్యలెక్కడ..? కేంద్రంపై కవిత ఫైర్..

నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయటంపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత స్పందించారు. విద్యార్థుల ప్రొటెస్ట్ కారణంగానే కేంద్రమంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కేవలం కేంద్ర మంత్రి రిజైన్ చేస్తే సరిపోదన్నారు. శనివారం ఎక్స్ వేదికగా స్పందించారు. పేపర్ లీకేజీ సంక్షోభాలకు ఇది ఎంత మాత్రం పరిష్కారం కాదన్నారు. కేవలం బీజేపీకి జరిగిన డ్యామేజ్ కంట్రోల్ చేసుకునేందుకే కేంద్రమంత్రి తో రాజీనామా చేయించారని చెప్పారు.  …

AP

మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంలో కలకలం.. భర్త, అత్తమామలతో సహా 11 మందిపై మందిపై గృహ హింస కేసు..

వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంలో ఊహించని వివాదం తెరపైకి వచ్చింది. ఆయన కుమారుడు జోగి రాజీవ్ భార్య మేఘన ఇచ్చిన ఫిర్యాదుతో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో జోగి రమేష్‌తో సహా ఆయన కుటుంబ సభ్యులపై తీవ్రమైన కేసులు నమోదయ్యాయి. ఈ పరిణామం స్థానికంగానే కాక రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర సంచలనంగా మారింది.   వరకట్న వేధింపులు.. హత్యాయత్నం ఆరోపణలు బాధితురాలు మేఘన పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. వివాహం…

AP

ఆగస్టు నుంచి ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్.. సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన..

కర్నూలు జిల్లాలోని స్వయం సహాయ సంఘాల మహిళలకు రూ.197 కోట్ల చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించారు. అనంతరం సంజీవని బహిరంగ సభలో మాట్లడారు. సీఎం అంటే సెక్రటేరీయేట్‌లో ఉండే చీఫ్ మినిస్టరే కాదు.. ప్రజలతో ఉండే కామన్ మ్యాన్ అనేది నా భావన.. అందుకే నిత్యం ప్రజలతోనే ఉంటున్నానని అన్నారు. నిత్యం ప్రజలతో ఉంటేనే ఉత్సాహంగా ఉంటానని, నెలలో నాలుగు కార్యక్రమాల ద్వారా నిత్యం ప్రజలతో మమేకం అయ్యేలా కార్యక్రమాలు రూపొందించుకున్నాంమని తెలిపారు.   రాష్ట్రవ్యాప్తంగా…

National

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా… కేంద్ర విద్యాశాఖ నూతన మంత్రిగా ప్రహ్లాద్ జోషి..

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ వివాదం కేంద్ర మంత్రివర్గంలో కీలక మార్పుకు దారితీసింది. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం నేపథ్యంలో, నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. అనంతరం, ఆయన స్థానంలో సీనియర్ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ అదనపు బాధ్యతలను అప్పగిస్తూ మోదీ సర్కారు నిర్ణయం తీసుకుంది.   నీట్ పేపర్ లీక్…

National

రాజకీయాల్లోకి ‘కాక్రోచ్’ పార్టీ..?

నీట్ పేపర్ లీక్ వివాదంపై నెల రోజులుగా సాగుతున్న ఆందోళనలు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామాతో ముగిశాయి. నిరసనలకు నాయకత్వం వహించిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించడంతో సుదీర్ఘ పోరాటం ముగిసింది. అయితే, ఈ విజయం తర్వాత సీజేపీ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తుందా? అనే చర్చ మొదలైంది. దీనిపై ఆ పార్టీ నేతలు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు.   ఈ పరిణామాల అనంతరం ‘ఎన్డీటీవీ’కి ఇచ్చిన…