అక్టోబర్ నెలలోనే స్థానిక ఎన్నికలు..: మంత్రి నారా లోకేశ్
రాష్ట్ర మంత్రులతో విద్యాశాఖ మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి పార్టీల యంత్రాంగాన్ని సంపూర్ణంగా సన్నద్ధం చేయడం, కొత్త పింఛన్ల పంపిణీ ప్రక్రియతో పాటు శాఖాపరమైన పనితీరుపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ అక్టోబర్ నెల నుంచి దశలవారీగా కొత్త పింఛన్లు అందజేయాలని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. అందిన ప్రతి దరఖాస్తును ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, పారదర్శకంగా అర్హులకు లబ్ధి చేకూర్చాలని మంత్రులకు సూచించారు.…

