వీడని మిస్టరీ..! చిన్నారి జ్ఞానేశ్వరి కోసం రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్..!
కాకినాడ జిల్లాలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు మరింత ముమ్మరమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందాలు కూడా రంగంలోకి దిగాయి. ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, అటవీ, రెవెన్యూ, అగ్నిమాపక శాఖలకు చెందిన 400 మంది సిబ్బంది గాలింపులో పాల్గొంటున్నారు. తుని మండలం సిహెచ్ అగ్రహారంలోని పామాయిల్ తోటలో జూన్ 6న చిన్నారి జ్ఞానేశ్వరి తప్పిపోయింది. తోటలో పనిచేసే…

