తెలంగాణలో ‘ఎస్ఐఆర్’… రాజకీయ పార్టీల సహకారం కోరిన సీఈఓ..
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) 2026 కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల సహకారాన్ని కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సి. సుదర్శన్ రెడ్డి శుక్రవారం సమావేశం నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటర్లుగా నమోదు చేయడమే కాకుండా, జాబితాలోని అవకతవకలను తొలగించి, అత్యంత పారదర్శకమైన ఓటర్ల జాబితాను రూపొందించడమే తమ లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని బీఆర్‌కేఆర్ భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో, జూన్…

