Editor

TELANGANA

400 ఎకరాల భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వంపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు చర్యలు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.   సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ ఈరోజు మధ్యాహ్నం మధ్యంతర నివేదికను పంపించారు. హైకోర్టు నివేదికను జస్టిస్ గవాయ్ ధర్మాసనం పరిశీలించింది. చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇది చాలా తీవ్రమైన అంశమని పేర్కొంది.   కంచ…

AP

ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్‌ను ఏపీకి ఆహ్వానించిన సీఎం చంద్రబాబు..

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజ సంస్థ ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్‌ను అమరావతికి ఆహ్వానించారు. రాష్ట్రంలో ఏఐ ఆధారిత అభివృద్ధికి గల అవకాశాలను పరిశీలించాల్సిందిగా కోరారు. భారతదేశం ఏఐకి త్వరగా అలవాటుపడిందని, భారతీయుల సృజనాత్మకత అద్భుతమని ఆల్ట్‌మన్ చేసిన ట్వీట్ కు చంద్రబాబు స్పందించారు. ఈ మేరకు ఆయనను ఏపీకి ఆహ్వానించారు.   ఏఐలో భారత్ దూసుకుపోతోందని శామ్ ఆల్ట్ మన్ చేసిన వ్యాఖ్యల పట్ల చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్…

National

మమతా బెనర్జీకి సుప్రీం కోర్టు భారీ షాక్..! ఏమైందంటే..?

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు భారీ షాకిచ్చింది. పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్‌ పరిధిలో ఉద్యోగాలు పొందిన 25 వేల మందికి పైగా టీచర్లు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. నియామక ప్రక్రియ మొత్తం లోపభూయిష్టంగా, కళంకితమైనదిగా ఉందని పేర్కొంది. దానికి విశ్వసనీయత, చట్టబద్ధత లేదని స్పష్టం చేసింది.   హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం కనిపించడం లేదని సుప్రీంకోర్టు…

TELANGANA

ఎమ్మెల్యే అనర్హత కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు..

ఎమ్మెల్యే అనర్హత కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై నాలుగేళ్లు స్పీకర్‌ ఎలాంటి చర్యలు తీసుకోకపోయినా కోర్టులు చూస్తూ ఉండాల్సిందేనా అంటూ సుప్రీం ప్రశ్నించింది. న్యాయస్థానాలు రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తాయని జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ స్పష్టం చేసారు. ఈ కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తరఫున సీనియర్‌ న్యాయవాది జస్టిస్ ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. స్పందించిన జస్టిస్ గవాయ్ ఆసక్తికర ప్రశ్నలు సంధించారు.   బీఆర్ఎస్ కు కు చెందిన ఎమ్మెల్యేలు పార్టీ…

National

వెబ్ సిరీస్ చూసి బ్యాంకులో చోరీ..

సినిమాల్లో క్రైమ్ స్టోరీలు చూడడం అంటే అందరికీ చాలా ఇష్టం. ఎందుకంటే అవి చాలా ఆసక్తి కరంగా.. సస్పెన్స్ తో ఉంటాయి. కానీ అలాంటి ఘటనలు నిజజీవితంలో జరుగుతుంటే అందరూ భయపడతారు. అయితే థ్రిల్లర్ సినిమాకంటే ఎక్కువ ట్విస్టులతో కూడిన ఒక రియల్ లైఫ్ ఘటన కొన్ని నెలల క్రితం కర్ణాటక రాష్ట్రంలో సంచలనంగా మారింది. అయిదు నెలల క్రితం రాష్ట్రంలోని దావణగెరె జిల్లాలో జరిగిన ఒక హై ప్రొఫైల్ బ్యాంక్ చోరీ (Bank Robbery) కేసుని…

TELANGANA

కంచ గచ్చిబౌలి భూములపై హైకోర్టు ఎంట్రీ..!

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం హైకోర్టుకు చేరింది. ఆ 400 ఎకరాల భూమిని జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని వట ఫౌండేషన్, HCU స్టూడెంట్స్ పిటిషన్ వేయగా.. కోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. పిటిషనర్ తరఫున ఖరీదైన లాయర్ నిరంజన్‌రెడ్డి వాదించారు. ఆయనకు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి ధీటుగా కౌంటర్ ఇచ్చారు.   పిటిషనర్ ఏమని వాదించారంటే..   హాలీవుడ్‌ సినిమాల తరహాలో.. భారీ సంఖ్యలో బుల్డోజర్లు పెట్టి.. 400 ఎకరాల భూమిని చదును చేస్తున్నారని న్యాయవాది…

AP

రజినికి చుక్కెదురు..!

పేటలో రజనమ్మకు పేటరాప్ తప్పడం లేదా? ఆమె చుట్టూ ఇన్ని కేసులు మారు మోగుతున్నాయి.. కారణమేంటి? అధికారంలో ఉండగా.. రజనీ అన్నేసి అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారా? హైకోర్టు తీర్పుతో మొత్తం తారుమారేనా? పేటలో అసలేం జరుగుతోంది? అక్కడి పార్టీ భవితవ్యమేంటి?   గెలిచిన తొలిసారే మంత్రి పదవి కొట్టిన రజనీకి సడెన్ స్టార్ గా పేరు   గెలిచిన తొలిసారే.. ఎమ్మెల్యే ఆపై మంత్రి పదవి కూడా కొట్టేసిన రజనీకి సడెన్ స్టార్ గా పేరుంది. ఎంత…

AP

పాస్టర్ ప్రవీణ్ భార్య సంచలన వీడియో..!

పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మృతి కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సంచలన మారింది. ప్రవీణ్ మృతిపై పోలీస్ అధికారులు కూడా సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రవీణ్ ఎలా చనిపోయారనేది ఇప్పటి వరకు కూడా ఓ క్లారిటీ రాలేదు. రాష్ట్రంలో కొందరు యాక్సిడెంట్ ద్వారా చనిపోయాడని చెబుతుంటే.. మరి కొందరు మాత్ర ప్రవీణ్ ను కిరాతకంగా హత్య చేసి చంపారని ఆరోపిస్తున్నారు. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.   మార్చి 24న…

TELANGANA

హెచ్‌సీయూ వివాదంపై కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ కీలక ఆదేశాలు..

హైదరాబాద్ కంచె గచ్చిబౌలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూములపై తక్షణమే నివేదికను పంపాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ సంబంధిత శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. కొద్దిసేపటి క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ బీజేపీ ఎంపీలు బండి సంజయ్ కుమార్, డీకే అరుణ, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జి.నగేశ్, రఘునందన్ రావు తదితరులు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ను కలిసి…

AP

పాస్టర్ మృతి కేసు.. మాజీ ఎంపీకి పోలీసులు నోటీసులు..

పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మృతి కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అయితే, నిన్న పాస్టర్ ప్రవీణ్ మృతి రోడ్డు ప్రమాదం వలన జరగలేదని.. ప్రవీణ్ ది ముమ్మాటికీ హత్యే అని.. ఇందులో ప్రభుత్వ హస్తం ఉందని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించిన విషయం తెలిసింద. సోమవారంఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాలను విజయవాడలోనే చంపేశారు. పోలీసులకు నేను సవాల్ విసురుతున్నా. నేను హెల్మెట్ పెట్టుకుని అదే వేగంతో ప్రవీణ్ పడిన…